Trisha: బాడీగార్డ్‌తో మళ్లీ... ఇది నాలుగోసారి

ABN , Publish Date - Feb 22 , 2024 | 11:27 AM

టాలీవుడ్‌లో మరో హిట్‌ కాంబో తెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. విక్టరీ వెంకటేష్‌, త్రిషలది తెలుగునాట సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, 'నమో వేంకటేశా’, 'బాడీగార్డ్‌' చిత్రాలతో హ్యాట్రిక్‌ కొట్టారు.

Trisha: బాడీగార్డ్‌తో మళ్లీ... ఇది నాలుగోసారి

టాలీవుడ్‌లో మరో హిట్‌ కాంబో తెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. విక్టరీ వెంకటేష్‌(Venkatesh), త్రిషలది (Trisha) తెలుగునాట సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, 'నమో వేంకటేశా’, 'బాడీగార్డ్‌' చిత్రాలతో హ్యాట్రిక్‌ కొట్టారు. ప్రస్తుతం ఈ జోడీ ఓ చిత్రంలో నటించబోతున్నారు. 'ఎఫ్‌ 2' ఫ్రాంచైజ్‌ చిత్రాలతో అలరించిన వెంకటేశ్‌, అనిల్‌ రావిపూడి మరో చిత్రానికి శ్రీకారం చుట్టారని తెలిసింది. దిల్‌రాజు నిర్మాత. కథ దాదాపుగా సిద్థమైంది. మరో పక్క ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రిష పేరుని పరిశీలిస్తున్నారు. దాదాపు త్రిషనే ఖరారు అయ్యే అవకాశం ఉందని సమాచారం.

Venki mama.jpeg

పల్లెటూరి నేపథ్యంలో కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి దిల్‌ రాజు తన బ్యానర్‌ మీద 'శతమానం భవతి' పార్ట్‌ 2 విడుదల చేయాలని భావించారు. అయితే ఇప్పుడా ప్లేస్‌లో వెంకీ, అనిల్‌ సినిమా తీసుకురానున్నారని  చిత్ర వర్గాల నుంచి సమాచారం. 

Updated Date - Feb 22 , 2024 | 11:27 AM