Satya: సాయిధరమ్‌ తేజ్‌, స్వాతిల ‘స‌త్య‌’కు అవార్డుల పంట‌!

ABN , Publish Date - Feb 15 , 2024 | 09:23 PM

సుప్రీం హీరో హీరో సాయిధరమ్‌ తేజ్, కలర్స్‌ స్వాతి జంటగా న‌టుడు నవీన్ విజయ్‌ కృష్ణ దర్శకత్వం వహించిన మ్యూజికల్‌ షార్ట్‌ ఫీచర్ ఫిలిం ‘సత్య’ . దేశభక్తి ప్రధానంగా సాగే ఈ పాట‌ గత ఆగస్టు 15న విడుద‌లై విమ‌ర్శకుల ప్ర‌శంస‌లను అందుకున్న‌ది.

Satya: సాయిధరమ్‌ తేజ్‌, స్వాతిల ‘స‌త్య‌’కు అవార్డుల పంట‌!

సుప్రీం హీరో హీరో సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej), కలర్స్‌ స్వాతి (Swathi Reddy) జంటగా న‌టుడు నవీన్ విజయ్‌ కృష్ణ (Nawin Vijaya Krishna) దర్శకత్వం వహించిన మ్యూజికల్‌ షార్ట్‌ ఫీచర్ ఫిలిం ‘సత్య’ (Satya) రూపొందింది. దేశభక్తి ప్రధానంగా సాగే ఈ పాట గత ఆగస్టు 15న విడుద‌లై విమ‌ర్శకుల ప్ర‌శంస‌లను అందుకున్న‌ది. దేశ వ్యాప్తంగా చాలా వేదికలపై ప్రదర్శించబడి అనేక అవార్డులను సాధించింది.

WhatsApp Image 2024-02-15 at 7.55.56 PM.jpeg

దేశం కోసం ప్రాణాల‌ర్పించి స‌రైన గుర్తింపు ద‌క్క‌ని అమ‌ర వీరుల‌కు నివాళిగా ఈ మ్యూజిక్‌ వీడియోను తెర‌కెక్కించారు. ‘అమ్మ ఎప్పుడూ అంటుండేది నేను మహరాణినని.. ఓ రోజు ఒక మహారాజు వచ్చి నన్ను తీసుకెళ్తాడని’.. అంటూ ప్రారంభమయ్యే ఈ పాట చాలా ఎమోషనల్ గా సాగుతూ కంటతడి పెట్టిస్తుంది.


అయితే తాజాగా ఈ పాట మ‌రో మైలురాయిని అందుకుంది. ఫ్రాన్స్‌లో జ‌రిగిన ‘టౌలౌస్ షార్ట్ ఫెస్ట్ 2024’ (Toulouse Shorts Fest 2024)లో ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ న‌టితో స‌హ మొత్తంగా 8 అవార్డుల‌ను ద‌క్కించుకుని స‌రికొత్త రికార్డును తిర‌గ‌రాసింది. భారత దేశ ఖ్యాతిని, తెలుగు వారి గొప్పతనాన్ని మరో సారి ప్రపంచానికి చూపెట్టింది. ఈ విషయాన్ని దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్ (Dil Raju Productions) టీమ్ అభిమానులతో పంచుకుంటు సోష‌ల్ మీడియాలో ఓ పోస్టు పెట్ట‌గా నెట్టింట తెగ వైర‌ల్ అవ‌డ‌మే కాకుండా స‌ర్వ‌త్రా అభినంద‌న‌ల వెల్లువ సాగుతోంది.

Updated Date - Feb 15 , 2024 | 09:31 PM