Tinnu Anand: ప్రభాస్‌ పొగిడితే ఎలా ఉంటుందో తెలుసా?

ABN , Publish Date - Jan 23 , 2024 | 12:55 PM

ప్రభాస్‌(Prabhas) హీరోగా ప్రశాంత్  నీల్‌ (Prashanth neel) దర్శకత్వం వహించిన ‘సలార్‌’ భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే! సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న చిత్ర బృందం తదుపరి సలార్‌ (Salaar) పార్ట్‌ -2 చిత్రీకరణపై దృష్టి సారించనుంది.

Tinnu Anand: ప్రభాస్‌ పొగిడితే ఎలా ఉంటుందో తెలుసా?

ప్రభాస్‌(Prabhas) హీరోగా ప్రశాంత్  నీల్‌ (Prashanth neel) దర్శకత్వం వహించిన ‘సలార్‌’ భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే! సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న చిత్ర బృందం తదుపరి సలార్‌ (Salaar) పార్ట్‌ -2 చిత్రీకరణపై దృష్టి సారించనుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన టీనూ ఆనంద్‌ (Tinnu Anand) సినిమా చిత్రీకరణ రోజులను గుర్తు చేసుకుంటూ హీరో ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించారు. ఇతరులను ప్రోత్సహించడంలో ప్రభాస్‌ ముందుంటారని చెప్పారు. సినిమా సక్సెస్‌లో భాగంగా టినూ ఆనంద్‌ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘సౌత్‌ ఇండస్ట్రీ వర్సెస్‌ బాలీవుడ్‌’ అంశంపై ఆయన మాట్లాడారు.

‘‘ఓ రోజు నేను, ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, ఆయన భార్య, ప్రశాంత్‌ నీల్‌ ‘సలార్‌’ సెట్స్‌లో ల్యాప్‌టాప్‌లో టీజర్‌ చూశాం. అందులో తన పాత్రకు నేనిచ్చిన ఎలివేషన్‌కు ప్రభాస్‌ ఫిదా అయ్యారు. వెంటనే నా దగ్గరకు వచ్చి హగ్‌ చేసుకున్నారు. టీజర్‌ మొత్తంలో ఒకే ఒక షాట్‌ తనది. అయినా ‘టీనూ సర్‌.. అదిరిపోయింది’ అని నన్ను ప్రశంసించారు. మనం చేసిన పనిని ఎవరైనా.. నలుగురిలో ప్రశంసిస్తే మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కిన స్టార్‌ హీరో ప్రభాస్‌ పొగిడితే ఎలా ఉంటుంది..? మరోవైపు, టీజర్‌ చూడడం పూర్తయిన వెంటనే ‘ప్రశాంత్‌.. ఇప్పుడే దీన్ని విడుదల చేయండి’ అంటూ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సతీమణి అన్నారు. సెట్స్‌లో ఉన్న ఇతరులు నన్ను అభినందించారు. అప్పుడు నేను పొందిన అనుభూతిని బాలీవుడ్‌లో ఎప్పుడూ పొందలేదు’’ అని చెప్పి భావోద్వేగానికి లోనయ్యారు. సలార్‌ టీజర్‌లో ‘సింపుల్‌ ఇంగ్లిష్‌..’ అంటూ టీనూ చెప్పిన డైలాగ్‌ విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో ఆ పాత్రధారి ఎవరోనని నెటిజన్లు టీను  గురించి సెర్చ్‌ చేయడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే! టీనూ ఆనంద్  ప్రభాస్ తో చేసిన  రెండో సినిమా . 'సాహో'లోనూ ఇతడు నటించాడు. అయితే తెలుగులో టీనూ ఆనంద్ మొదటగా బాలకృష్ణ 'ఆదిత్య 369' మూవీలో నటించాడు. చిరంజీవి 'అంజి'లోనూ భాటియా అనే పాత్రలో విలనిజం పండించాడు. గతేడాది వచ్చిన 'సీతారామమ్'లో ఆనంద్ మెహతా అనే పాత్రలో కనిపించింది టీనూనే.

ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘సలార్‌’ క్రిస్మస్‌ కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. శ్రుతి హాసన్‌, జగపతిబాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహా కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ‘నెట్‌ఫ్లిక్స్‌’ ఓటీటీలో స్ర్టీమింగ్‌ అవుతోంది.

Updated Date - Jan 23 , 2024 | 01:38 PM