టిల్లు స్క్వేర్ కొత్త విడుదల తేదీ ఖరారు చేసింది

ABN , Publish Date - Jan 26 , 2024 | 01:50 PM

అనుపమ పరమేశ్వరన్ ఇంతకు ముందు ఏ సినిమాలో కనపడనంత గ్లామర్ గా ఈ 'టిల్లు స్క్వేర్' లో కనపడనుంది అని ఆ సినిమా నుండి విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు చూస్తేనే అర్థం అవుతోంది. సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు.

టిల్లు స్క్వేర్ కొత్త విడుదల తేదీ ఖరారు చేసింది
A still from Tillu Square

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా వస్తున్న 'టిల్లు స్క్వేర్' సినిమా కొత్త విడుదల తేదీని ఖరారు చేసింది. ఈ సినిమా ఇప్పటికి రెండు మూడు తేదీలను ప్రకటించి వాయిదా వేస్తూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు ఒక కొత్త తేదీని అంటే మార్చి 29, 2024 న విడుదలవుతోంది చిత్ర నిర్వాహకులు ప్రకటించారు. మళ్ళీ మార్పులు లేకుండా ఇదే తేదీని ఖరారు చేస్తారని అనుకుంటున్నారు. ఇంతకు ముందు సిద్ధు నటించిన 'డీజీ టిల్లు' కి ఈ సినిమా సీక్వెల్ గా వస్తోంది.

అయితే మొదటి దానిలో నేహా శెట్టి కథానాయిక కాగా, ఈ 'టిల్లు స్క్వేర్' లో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి కూడా. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ 'కిల్లర్' లుక్స్ ఇప్పటికే బాగా పాపులర్ అయ్యాయి. మార్చి 29 అనగానే అప్పటికి వేసవి సెలవులు మొదలవుతాయి కాబట్టి ఈ సినిమాకి అది మంచి విడుదల తేదీగా చిత్ర నిర్వాహకులు భావించవచ్చు అని అంటున్నారు. కానీ ఆ సమయంలో పార్లమెంటుకి, ఆంధ్రాలో అసెంబ్లీ కి ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంటే మాత్రం అప్పుడు ఈ సినిమా విడుదల తేదీలో మార్పులు ఏమైనా ఉండొచ్చేమో అని కూడా అంటున్నారు.

tillusquarestill.jpg

ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకుడు, సూర్యదేవర నాగ వంశీ నిర్మాత. ఈ సినిమాకి ప్రముఖ గాయకుడు రామ్ మిరియాల సంగీతాన్ని అందించటమే కాకుండా అతను పాడిన పాటలు 'టిక్కెట్టే కొనకుండా', 'రాధిక' పాటలు బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి గత సంవత్సరం నుండి వార్తల్లో వుంది, విడుదల తేదీలు, ప్రచార చిత్రాలతో, ఎట్టకేలకి ఇప్పుడు ఒక విడుదల తేదీ ఖరారు చేశారు.

Updated Date - Jan 26 , 2024 | 01:50 PM