Venu: తొట్టెంపూడి వేణుకు పితృవియోగం

ABN , Publish Date - Jan 29 , 2024 | 11:20 AM

టాలీవుడ్‌ నటుడు వేణు తొట్టెంపూడి (Venu) ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి ప్రొఫెసర్‌ వెంకట సుబ్బారావు (92) సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Venu: తొట్టెంపూడి వేణుకు పితృవియోగం

టాలీవుడ్‌ నటుడు వేణు తొట్టెంపూడి (Venu) ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి ప్రొఫెసర్‌ వెంకట సుబ్బారావు (92) సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థ్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.

'స్వయంవరం' చిత్రంతో కథానాయకుడిగా టాలీవుడ్‌కు పరిచయమైన వేణు 'మనసుపడ్డాను కానీ', 'చిరునవ్వుతో', 'హనుమాన్ జంక్షన్', 'పెళ్లాం రెళితే', 'పెళ్లాంతో పనేంటి', 'మళ్లీ మళ్లీ చూడాలని', 'గోపి.. గోపిక..గోదావరి' వంటి హిట్‌ చిత్రాల్లో నటించారు. పదేళ్ల గ్యాప్‌ తర్వాత ఇటీవల రవితేజ హీరోగా నటించిన 'రామారావు ఆన్  డ్యూటి' చిత్రంతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రీ ఎంట్రీ ఇచ్చారు. 'అతిథి' అనే వెబ్‌ సిరీస్‌తో ఆకట్టుకున్నారు.

Updated Date - Jan 29 , 2024 | 11:20 AM