Movies in Theatres: ఈ వారం రెండు, మూడు చిత్రాలతోనే..!

ABN , Publish Date - Feb 12 , 2024 | 02:11 PM

ఈ వారం రెండు, మూడు చిత్రాలతోనే..! ఫిబ్రవరి నెల మొదలై అప్పుడే మూడో వారం వచ్చేసింది. గడిచిన రెండువారాలు చిన్నా, పెద్ద చిత్రాలు థియేటర్స్‌లో సందడి చేశాయి. ఈవారం కూడా పలు చిత్రాలు థియేటర్స్‌లో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

Movies in Theatres:  ఈ వారం రెండు, మూడు చిత్రాలతోనే..!


ఫిబ్రవరి నెల మొదలై అప్పుడే మూడో వారం వచ్చేసింది. గడిచిన రెండువారాలు చిన్నా, పెద్ద చిత్రాలు థియేటర్స్‌లో సందడి చేశాయి. ఈవారం కూడా పలు చిత్రాలు థియేటర్స్‌లో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వైవిధ్యమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న మలయాళ స్టార్‌ మమ్ముట్టి మరో భిన్నమైన కథతో సందడి చేయడానికి సిద్థమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భ్రమయుగం’. హారర్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రాహుల్‌ సదాశివన్‌ తెరకెక్కించారు. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌, పోస్టర్స్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ నెల 15న ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. చక్రవర్తి రామచంద్ర, శశికాంత్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Bramayugam.jpg

మాయమైన నాలుగు పేజీలు..


సందీప్‌కిషన్‌ హీరోగా వి.ఐ.ఆనంద్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఊరు పేరు భైౖరవకోన’. థ్రిల్లర్‌, సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కావ్య థాపర్‌, వర్ష బొల్లమ్మ కథానాయికలు. ఓ ఫాంటసీ ప్రపంచంలోకి ఈ చిత్రం తీసుకెళ్తుందని చిత్ర బృందం చెబుతోంది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 16న థియేటర్స్‌లో విడుదల కానుంది. ‘గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీల భైరవకోన’ అంటూ విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తి పెంచాయి.

Bharava-kona.jpg

ఓటీటీ కాదు.. థియేటర్‌లోనే...


జయం రవి, కీర్తి సురేష్‌ కీలక పాత్రల్లో నటించిన యాక్షన్  చిత్రం ‘సైరెన్‌’. 108.. అనేది ఉపశీర్షిక. ఆంటోనీ భాగ్యరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేసి క్రిమినల్‌గా మారిన ఓ వ్యక్తి కథ’తె థ్రిల్లింగ్‌ కథనంతో ఈ చిత్రం రూపొందింది. 14 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి జైలు నుంచి బయటికొచ్చి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది సినిమాలో చూపించనున్నారు.  కీర్తి ఇందులో పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు. అనుపమ పరమేశ్వరన్‌ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ స్వరకర్త.

Updated Date - Feb 12 , 2024 | 02:11 PM