The Raja Saab: అదిరే అప్‌డేట్ వచ్చింది!
ABN, Publish Date - Oct 21 , 2024 | 05:55 PM
ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది రాజాసాబ్. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్థి కుమార్ హీరోయిన్లు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆప్‌డేట్ రానే వచ్చింది.
ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది రాజాసాబ్. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్థి కుమార్ హీరోయిన్లు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆప్‌డేట్ రానే వచ్చింది. తాజాగా చిత్ర బృందం ఓ అప్‌డేట్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. డార్లింగ్ ప్రబాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 23న రాయల్ ట్రీట్‌గా టీజర్, ట్రెలర్ రిలీజ్ చేయనున్నట్లుప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్ట్‌ర్‌ను షేర్ చేశారు. అందులో ప్రభాస్ గళ్ల చొక్కా, కళ్లద్దాలు పెట్టుకుని స్టైల్‌గా నడుస్తూ కనిపించారు.
హారర్, కామెడీ నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతోంది. ప్రభాస్ పుట్టినరోజు నుంచి వరుస అప్‌డేట్స్ ఉంటాయని నిర్మాత ఎస్‌కేఎన్ తెలిపారు. అక్టోబరు 23 నుంచి సినిమా విడుదల వరకు ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. పాన్ ఇండియా స్థ్థాయిలో ఈ చిత్రం ఏచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది.అ