Ari: ‘అరి’.. వినోద్ వర్మ ఫస్ట్ లుక్ విడుదల

ABN , Publish Date - Feb 28 , 2024 | 10:25 AM

ఆర్‌వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. ‘పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన క్యారెక్టర్ లుక్స్, ట్రైలర్, సాంగ్‌ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించిన వినోద్ వర్మ క్యారెక్టర్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Ari: ‘అరి’.. వినోద్ వర్మ ఫస్ట్ లుక్ విడుదల
Vinod Varma in Ari Movie

ఆర్‌వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘అరి’ (Ari). ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘పేపర్ బాయ్’ (Paper Boy) చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ (Jaya Shankar) దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన క్యారెక్టర్ లుక్స్, ట్రైలర్, సాంగ్‌ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించిన వినోద్ వర్మ (Vinod Varma) క్యారెక్టర్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.


Ari.jpg

ఈ ఫస్ట్ లుక్‌లో ఓ పెద్ద లైబ్రరీలో ఇంపార్టెంట్ విషయాలు నోట్ చేసుకుంటున్న వినోద్ వర్మ స్టిల్ ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తోంది. ‘అరి’ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్ధమవుతోంది. ఈ మూవీలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. త్వరలోనే ‘అరి’ సినిమాను గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా హిందీ రీమేక్ పై బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఆసక్తి చూపిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపిస్తుండటం విశేషం. త్వరలోనే ‘అరి’ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌తో పాటు మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు. (Vinod Varma Look From Ari)

Updated Date - Feb 28 , 2024 | 10:25 AM