ఇక్క‌డ ప‌ద్ద‌తి, సంస్కారం.. అక్క‌డ బోల్డు, వైల్డ్‌!

ABN , Publish Date - Jan 10 , 2024 | 03:40 PM

తెలుగు నాట గ‌ర్ల్ నెక్ట్స్ డోర్‌, ప‌క్కింటి అమ్మాయి పాత్ర‌ల‌ను చేస్తూ అభిమానుల‌ను పెంచుకోవ‌డ‌మే కాక‌ ఫ్యామిలీ అడియెన్స్‌లోనూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న న‌టీమ‌ణులు చాలామందే ఉన్నారు. కానీ వీరిలో కొంద‌రు బాలీవుడ్ సినిమాలు, సిరీస్‌ల‌లో బోల్డ్ పాత్ర‌ల‌లో న‌టిస్తూ అభిమానులు ఖంగుతినేలా చేస్తున్నారు.

ఇక్క‌డ ప‌ద్ద‌తి, సంస్కారం.. అక్క‌డ బోల్డు, వైల్డ్‌!
bollywood

తెలుగు నాట గ‌ర్ల్ నెక్ట్స్ డోర్‌, ప‌క్కింటి అమ్మాయి పాత్ర‌ల‌ను చేస్తూ అభిమానుల‌ను పెంచుకోవ‌డ‌మే కాక‌ ఫ్యామిలీ అడియెన్స్‌లోనూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న న‌టీమ‌ణులు చాలామందే ఉన్నారు. ఆయా సినిమాల‌లో వారి పాత్ర‌ల‌ను చూసి వీరు ఇలాంటి పాత్ర‌ల‌కే పుట్టారేమో అనేలా వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. మ‌రి వాళ్లు కావాల‌నే అలాంటివి సెల‌క్ట్ చేసుకుంటారా,లేక అలాంటి క్యారెక్ట‌ర్స్ వారికి ఏరి కోరి వ‌స్తాయోమో తెలియ‌దు కానీ తెలుగులో ఎన్ని చిత్రాలు చేసినా గ్లామ‌ర్‌కు దూరంగా హోమ్లీ క్యారెక్ట‌ర్ల‌లో మాత్ర‌మే క‌నిపిస్తూ ఉంటారు. కానీ వీరిలో కొంద‌రు బాలీవుడ్ సినిమాలు, సిరీస్‌ల‌లో న‌టించే అవ‌కాశం వ‌స్తే మాత్రం ఇక్క‌డికి భిన్నంగా ఉండే పాత్ర‌ల‌లో బోల్డ్‌గా న‌టిస్తూ,అద‌ర చుంబ‌నం సీన్ల‌లోను రెచ్చిపోయి న‌టిస్తూ అభిమానులు ఖంగుతినేలా చేశారు, చేస్తున్నారు. వారెవ‌రో మీరూ ఓ లుక్కేయండి.

అలాంటివారిలో ఫ‌స్ట్ వ‌చ్చే పేరు క‌మిలినీ ముఖ‌ర్జీ (Kamalinee Mukherjee). తెలుగులో ప‌దేళ్ల క్రితం వ‌చ్చిన‌ శేఖ‌ర్ క‌మ్ముల చిత్రాలు ఆనంద్, గోదావ‌రి సినిమాల‌ ద్వారా కుటుంబ ప్రేక్ష‌కుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది. సౌంద‌ర్య త‌ర్వాత క‌మిలినే మంచి న‌టి అన్నంత‌గా పేరు తెచ్చుకున్న ఈ భామ అదే కోవ‌లో తెలుగులో ఓ ప‌ది సినిమాలు చేయ‌గా అవ‌న్నీ గ‌ర్ల్ నెక్ట్స్ డోర్ పాత్ర‌లే కావ‌డం గ‌మ‌నార్హం. ఇక ఆ తర్వాత మ‌ళ‌యాళం సినిమాల వైపు మ‌ళ్లిన ఈ అమ్మ‌డు 2010లో మ‌మ్ముట్టి హీరోగా వ‌చ్చిన కుట్టి శ్రాంక్ అనే సినిమాలో న్యూడ్‌గా న‌టించి అభిమానుల‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది.

kamilini.jpeg

ఆ త‌ర్వాత త‌న సోంత భాష బెంగాలీలో 2012లో వ‌చ్చిన అపరాజిత తుమీ అనే సినిమాలో ముద్దు సీన్లలో రెచ్చిపోయింది. 2014లో రామ్‌చ‌ర‌ణ్ హీరోగా వ‌చ్చిన‌ గోవిందుడు అంద‌రివాడేలే అనే చిత్రంలో శ్రీకాంత్‌కు జోడీగా చివ‌రి సారిగా క‌నిపించిన ఈ ముద్దుగుమ్మ 2016లో మ‌ళ‌యాళంలో మోహ‌న్‌లాల్ స‌ర‌స‌న మ‌ణ్యంపులి సినిమాలో న‌టించింది.

nyra.jpg


అదే కోవ‌లోకి వ‌చ్చే మ‌రో న‌టి కృతి ఖ‌ర్బందా (Kriti Kharbanda). బోణీ అనే తెలుగు చిత్రం ద్వారా సినిమాల్లోకి వ‌చ్చిన ఈ ముద్దుగుమ్మ రామ్‌తో ఓంగోలు గిత్త‌, క‌ళ్యాణ్ రామ్ ఓం, మంచు మ‌నోజ్ మిస్ట‌ర్ నూక‌య్య‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ తీన్‌మార్, బ్రూస్ లీలో రామ్‌చ‌ర‌ణ్‌కు అక్క‌గా ప‌ద్ద‌తైన అమ్మాయి పాత్ర‌ల్లో న‌టించింది. 2015లో బ్రూస్ లీ త‌ర్వాత తెలుగులో క‌నిపించ‌ని ఈ భామ ఇక ఆ త‌ర్వాత 2016లో బాలీవుడ్‌లో ఆరంగేట్రం చేసి ఇమ్రాన్‌హ‌స్మికి జంట‌గా రాజ్ 3 సినిమాలో న‌టించి ముద్దు సీన్ల‌లో రెచ్చిపోయింది. ఇక ఆ త‌ర్వాత కూడా అమ్మ‌డు చేసిన మ‌రో మూడు నాలుగు సినిమాల్లోనూ కొన్ని ముద్దు సీన్ల‌లో న‌టించింది.

kriti.jpg

వీరితో పాటు జూ.ఎన్టీఆర్ టెంప‌ర్‌లో ఇంట‌ర్వెల్‌లో వ‌చ్చే చెల్లి పాత్ర‌తో పాటు ఓప‌ది తెలుగు సినిమాల్లో ప్ర‌ధాన పాత్ర‌ల్లో మెప్పించిన మ‌ధురిమ (నైరా బెన‌ర్జీ) (Nyra Banerjee) ఆ త‌ర్వాత హిందీ సిరీస్ ముఖ్యంగా ఆల్ట్ బాలాజీలో వ‌చ్చే హెల్లో జీ వంటి సిరీస్‌ల‌లో హ‌ద్దులు చేరిపేసి న‌టించింది. అదేవిధంగా లారెన్స్ ముని, కాంచ‌న‌ 3, బాల‌క్ష‌ష్ణ రూల‌ర్ సినిమాల్లో క‌థానాయిక‌గా న‌టించిన వేదిక 2019లో బాలీవుడ్‌లో వ‌చ్చిన ది బాడీ అనే సినిమాలో ఇమ్రాన్ హ‌స్మితో ఘాటైన లిప్ కిస్ సీన్ల‌లో న‌టించింది.

nithya memon.jpg

ప్ర‌స్తుతం తెలుగులో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ త‌రం క‌థానాయిక‌లు ఇషా రెబ్బా, మ‌ళ‌యాళ ముద్దుగ‌మ్మ‌ నిత్యా మీన‌న్‌, నివేథా పేతురాజ్‌లు ఇప్ప‌టివ‌ర‌కు ఓ ప‌దికి పైగా సినిమాలు చేసినా తెలుగు సినిమాలు చేసినా అవ‌న్నీ సంసార ప‌క్ష‌మైన‌వే ఉన్నాయి. ప్రేక్ష‌కులు కూడా వాటినే ఆద‌రించారు.

కానీ ఇషా రెబ్బా (Eesha Rebba) మ‌ళ‌యాళంలో న‌టించిన ఓట్టు చిత్రంలో హీరోతో రెండు మూడు ముద్దు సీన్ల‌లో న‌టించింది. ఇక మ‌న ప‌క్కింటి అమ్మాయి అని పేరున్న నిత్యామీన‌న్ (Nithya Menen) అమెజాన్ ప్రైమ్ వీడియోలో అభిషేక్ బ‌చ్చ‌న్ లీడ్ రోల్‌లో వ‌చ్చిన‌ బ్రీత్ అనే వెబ్ సీరిస్‌లో తోటి న‌టితో లెస్బియ‌న్ కిస్సింగ్ సీన్‌లో న‌టించి త‌నను ఎంత‌గానో అభిమానించే ఫ్యాన్స్ ఫీజులు ఎగ‌రగొట్టింది.

nivetha pethuraj.jpeg

అదేవిధంగా విశ్వ‌క్ సేన్ పాగ‌ల్‌, ధ‌మ్కీ, అలా వైకుంఠ‌పురం సినిమాల ద్వారా ఫ్యామిలీస్‌ల‌లో మంచి న‌టిగా పేరు తెచ్చుకున్న నివేథా పేతురాజ్ (Nivetha Pethuraj) ఇటీవ‌ల హిందీలో వ‌చ్చిన కాలా అనే వెబ్ సిరీస్‌లో బాత్రూమ్, కిస్ సీన్‌లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు షాకిచ్చింది.

అదేవిధంగా నాని హీరోగా వ‌చ్చిన‌ కృష్ణ‌గాడి వీర ప్రేమ గాథ‌ చిత్రం ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయి ఆ త‌ర్వాత హోమ్లీ పాత్ర‌ల‌లో న‌టిస్తూ వ‌స్తున్న‌ మెహ‌రీన్ ఫిర్జాదా (Mehreen Pirzada) ఎఫ్‌2లో గ్లామ‌ర్ ఓల‌క‌బోసింది. ఈ భామ ఇటీవ‌లే హిందీలో వ‌చ్చిన సుల్తాన్ అనే వెబ్ సిరీస్‌లో ముద్దు సీన్ల‌లో రెచ్చిపోయింది.

Updated Date - Jan 10 , 2024 | 03:52 PM