Tamannaah: నిజానిజాలు తెలుసుకోండి.. జోస్యం చెప్పొద్దు 

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:30 PM

పెరుగుతున్న టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని మిల్కీబ్యూటీ తమన్నా మండిపడ్డారు.  సోషల్‌ మీడియా ట్రోలింగ్‌పై ఆమె స్పందించారు. అందుబాటులో ఉన్న సాంకేతికతను ఓ మెట్టు ఎక్కడానికి ఉపయోగించాలి కానీ.. ఇలా ఇతరులను ఇబ్బంది పెట్టడానికి కాదని ఆమె అన్నారు

Tamannaah: నిజానిజాలు తెలుసుకోండి.. జోస్యం చెప్పొద్దు 


పెరుగుతున్న టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని మిల్కీబ్యూటీ తమన్నా(Tamannaah) మండిపడ్డారు.  సోషల్‌ మీడియా ట్రోలింగ్‌పై ఆమె స్పందించారు. అందుబాటులో ఉన్న సాంకేతికతను ఓ మెట్టు ఎక్కడానికి ఉపయోగించాలి కానీ.. ఇలా ఇతరులను ఇబ్బంది పెట్టడానికి కాదని ఆమె అన్నారు. తాజాగా ఐడియాస్‌ ఆఫ్‌ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న తమన్నా మాట్లాడుతూ ‘‘సెలబ్రిటీల విషయంలో నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరి అభిప్రాయాలు వాళ్లు చెబుతుంటారు. కొందరైతే చూసినట్లే మాట్లాడుతుంటారు. మా జీవితంలో ఏం జరగబోతోందో, ఏం చేయాలో కూడా కూడా వాళ్లే జోస్యంలాగా చెప్పేస్తారు. అలాంటి వాటిపై నేను దృష్టి పెట్టను. వాటి గురించి మాట్లాడితే వాళ్లను ఎంకరేజ్‌ చేసినట్లు అవుతుంది. దానివల్ల సమయం వృధా తప్ప ఇంకేం లేదు. జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లాలంటే ఏం చేయాలనే దానిపై శ్రద్థ పెడతాను’’ అని అన్నారు. (Tamannaah Bhatia)


Tam-s.jpg
 టాలీవుడ్‌, బాలీవుడ్‌ రెండూ తనకు సమానమే అని తమన్నా వ్యాఖ్యానించారు. "నేను ముంబయిలో పుట్టి పెరిగాను. నా సినీ జీవితం దక్షిణాది సినిమాలతో ప్రారంభమైంది. కళాకారులకు భాష, ప్రాంతాలతో సంబంధం ఉండదు. ఈ రెండు ప్రాంతాలను సొంత ఇళ్లుగా భావిస్తా. నిరంతరం ప్రయాణిస్తూనే ఉండాలి. ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే మా పని.  ప్రస్తుతం దక్షిణాది సినిమాల గురించి అంతర్జాతీయ స్థాయిలో గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అది విని ఎంతో సంతోషించా’’ అని తమన్నా అన్నారు.


Tamanaah.jpg

గత సంవత్సరం వరుస వెబ్‌ సిరీస్‌లతో విజయాలను అందుకున్న తమన్నా ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్రాలతో బిజీగా ఉన్నారు. రాజ్‌కుమార్‌ రావ్‌, శ్రద్థా కపూర్‌ జంటగా నటిస్తున్న ‘స్ర్తీ 2’ కోసం ప్రత్యేక గీతంలో నటిస్తున్నారు. అమర్‌ కౌశిక్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:30 PM