Tamannaah Bhatia: దర్శకుడిపై తమన్నా ప్రశంసలు!

ABN , Publish Date - Mar 10 , 2024 | 05:15 PM

తన 18 ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి వ్యక్తిని చూడలేదని దర్శకుడు సంపత నంది పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు మిల్కీ బ్యూటీ తమన్నా. తన టీమ్‌లోని ప్రతి ఒక్కరి ప్రతిభను గుర్తించి మెచ్చుకోవడం ఆయనకే చెల్లిందన్నారు

Tamannaah Bhatia: దర్శకుడిపై తమన్నా ప్రశంసలు!

తన 18 ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి వ్యక్తిని చూడలేదని దర్శకుడు సంపత నంది (Sampath nandi)పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah Bhatia). తన టీమ్‌లోని ప్రతి ఒక్కరి ప్రతిభను గుర్తించి మెచ్చుకోవడం ఆయనకే చెల్లిందన్నారు. ఇటీవల తమన్నా కథానాయికగా 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన ఆమె తాజాగా తెలుగులో ఓ సినిమాకు సైన్ చేసింది. తమన్నా ప్రధాన పాత్రలో డి.మధుతో కలిసి సంపత్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఓదెల 2’ (Odela 2). అశోక్‌ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా ఈ చిత్రంలోని తమన్నా లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె నాగ సాధువుగా కనిపించనున్నారు. ఈ లుక్‌కు విశేష స్పందన రావడంతో సంపత్‌ నంది సోషల్‌ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. తమన్నా లుక్‌ అద్భుతంగా రావడం వెనుక ఎవరెవరి కృషి ఉందో తెలియజేస్తూ పోస్ట్‌ పెట్టారు. కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నీతా లుల్లా నుంచి తమన్నా పర్సనల్‌ స్టాఫ్‌ వరకు అందరికీ థ్యాంక్స్‌ చెప్పారు.

Sampath.jpg

దీనిపై తమన్నా స్పందిస్తూ.. ‘‘సినిమా ఒకరి ఆలోచనతో ప్రారంభం కావొచ్చు. కానీ, సమష్టి కృషి వల్లే అది రూపొందుతుంది. ప్రతి విభాగానికి చెందిన వారిని సంపత్‌ ప్రశంసించడం విశేషం. ఆయన చెప్పినట్లు నా లుక్‌ వెనుక ఎంతోమంది శ్రమ ఉంది. ‘ఓదెల 2’లో భాగమైనందుకు ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు.



రెండేళ్ల క్రితం ఓటీటీలో విడుదలైన ‘ఓదెల రైల్వేే స్టేషన్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ రూపొందుతుంది. పార్ట్‌ 1లో కీలక పాత్ర పోషించినహెబ్బా పటేల్‌, వశిష్ఠ ఎన్‌. సింహ పార్ట్‌ 2లోనూ నటిస్తున్నారు. ఓదెల మల్లన్న స్వామి ఆ గ్రామాన్ని దుష్టశక్తుల నుంచి ఎలా రక్షిస్తాడనే అంశంతో.. విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ఇంపార్టెన్స్  ఇస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సంపత్  నంది తెలిపారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల కాశీలో ప్రారంభమైంది. గతంలో సంపత నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘రచ్చ’, ‘బెంగాల్‌ టైగర్‌’, ‘సీటీమార్‌’లో తమన్నా హీరోయిన్‌గా నటించారు. 

Updated Date - Mar 10 , 2024 | 05:15 PM