Singer Sunitha: చేతిలో ఫోన్‌ ఉన్నవారందరూ హీరోలే కదా!

ABN , Publish Date - Mar 10 , 2024 | 03:47 PM

గాయని సునీత గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాయనిగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, టెలివిజన్‌ షో హోస్ట్‌గా ఆమె బహుముఖ ప్రజ్ఞ కనబరిచారు. దాదాపు ఐదు సంవత్సరాల విరామం తర్వాత ఆమె మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ నెల 22న శిల్ప కళావేదికలో ఒక లైవ్‌షో చేస్తున్నారు.

Singer Sunitha: చేతిలో ఫోన్‌ ఉన్నవారందరూ హీరోలే కదా!


గాయని సునీత (Sunitha) గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాయనిగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, టెలివిజన్‌ షో హోస్ట్‌గా ఆమె బహుముఖ ప్రజ్ఞ కనబరిచారు. దాదాపు ఐదు సంవత్సరాల విరామం తర్వాత ఆమె మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ నెల 22న శిల్ప కళావేదికలో ఒక లైవ్‌షో చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘నవ్య’కు ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. సోషల్‌ మీడియా గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. (Singer Sunitha)

"నాకు అవసరమా? అనవసరమా? అనే విషయాన్ని ఆలోచించకుండా ఒకప్పుడు నేను సోషల్‌ మీడియాలోకి అడుగుపెట్టా. నా అకౌంట్‌కు ఉన్న లైక్‌ల కౌంట్‌ నామీద ఎలాంటి ప్రభావం చూపించదు. అయితే ఏదైనా ఒక విషయానికి సంబంధించి నిజాలు చెప్పాల్సి వచ్చినా, ఏదైనా అబద్ధం ప్రచారంలోకి వస్తున్నప్పుడు అది నిజం కాదని చెప్పాల్సి వచ్చినా దానికి సోషల్‌ మీడియా ఒక వేదికగా మారింది. ఈరోజుల్లో సోషల్‌ మీడియా అవసరం ఉంది.  తమ టాలెంట్‌ను ప్రపంచానికి చూపించాలనుకొనేవారికి ఇది వేదిక అనటంలో సందేహంలేదు. ఫ్యాన్‌ బేస్‌ కూడా పెరుగుతుంది. అయితే అక్కడ ఎవరి టార్గెట్‌ వాళ్లది. ఉదాహరణకు నేను ఒక పాట పాడి పెట్టాననుకోండి... నేను అవకాశాల కోసం ఆ పాటను పెట్టడం లేదు. అందరూ చూసి ఆనందించాలనేది నా టార్గెట్‌. ఇంకొకరి టార్గెట్‌ వేరేగా ఉండవచ్చు. సోషల్‌ మీడియా ఇంతగా లేని రోజుల్లో టాలెంట్‌ మీదే ఎక్కువగా ఫోకస్‌ ఉండేది. ఇప్పుడు వ్యక్తుల పట్ల ఆసక్తి బాగా పెరిగిపోయింది. నేను 2011 నుంచి సోషల్‌ మీడియాలో ఉన్నా. అప్పటి నుంచి వస్తున్న మార్పులు గమనిస్తూనే ఉన్నా. ఇప్పుడు అందరి చేతుల్లో స్మార్ట్‌ ఫోన్లు వచ్చేసాయి. ఫ్రీ వైఫై చాలా చోట్ల అందుబాటులోకి వచ్చేసింది. దాంతో చేతిలో ఫోన్‌ ఉన్నవారందరూ హీరోలే కదా! నా ఉద్దేశంలో సోషల్‌ మీడియాలో మంచి ఉంది, చెడూ ఉంది. మనకు ఏదైనా చెప్పాలనిపించినప్పుడు దీనిని ఉపయోగించుకుంటే కోట్ల మందికి ఒకేసారి వెళ్లిపోతుంది. నా విషయంలో జరిగిన ఒకో సంఘటన చెబుతాను. నేను ‘మా తోటలో మామిడి కాయ కాసింది’ అని పెడితే  ‘‘సునీత తల్లి కాబోతోంది’’ అని రాసేశారు. నేను మళ్లీ అదే వేదిక మీదకు వెళ్లి ‘‘నాయనలారా.. నన్ను అర్థం చేసుకోండి’’ అని అడిగా. అక్కడితో ఆ గొడవ సద్దుమణిగింది.

Sunitha.jpg

వాళ్లు నన్ను డిసైడ్‌ చేయలేరు...
నేను కూడా సోషల్‌ విక్టిమే. ఎవరినైనా బోనులో వేసి కొడుతున్నప్పుడు- కొద్దికాలానికి ఆ దెబ్బల బాధ తెలియదు. ‘నన్ను ట్రోల్‌ చేేసవాళ్లు, విమర్శించే వారు నా జీవితాన్ని డిసైడ్‌ చేేసవాళ్లు కాదు’ అనే విషయాన్ని నమ్మటం మొదలుపెట్టాక ప్రశాంతత వచ్చింది. నా సొంత మనుషులకు నేను ఏం చేస్తున్నానో తెలుసు. అలాంటప్పుడు ఎవరికో నేనెందుకు సమాధానం ఇవ్వాలి?

Updated Date - Mar 10 , 2024 | 04:47 PM