Ooru Peru Bhairava Kona: ఫిబ్రవరి 9న థియేట‌ర్ల‌లోకి.. సందీప్ కిషన్ ఫాంటసీ అడ్వెంచర్ ‘ఊరు పేరు భైరవకోన’

ABN , Publish Date - Jan 10 , 2024 | 05:53 PM

హీరో సందీప్ కిషన్, ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ ల‌ మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ ‘ఊరు పేరు భైరవకోన’ ఈ చిత్రం రిలీజ్ డేట్ కి సంబంధించిన అప్‌డేట్‌ మేకర్స్ ఈ రోజు ఇచ్చారు.

Ooru Peru Bhairava Kona: ఫిబ్రవరి 9న థియేట‌ర్ల‌లోకి.. సందీప్ కిషన్ ఫాంటసీ అడ్వెంచర్ ‘ఊరు పేరు భైరవకోన’
Ooru Peru Bhairava Kona

హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan), ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్(Vi Anand)ల మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ ‘ఊరు పేరు భైరవకోన’(Ooru Peru Bhairava Kona). హాస్య మూవీస్ (Hasya Movies) బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ (AKents Official) బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత.

ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairava Kona) రిలీజ్ డేట్ కి సంబంధించిన అప్‌డేట్‌ మేకర్స్ ఈ రోజు ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. సందీప్ కిషన్ మంత్ర దండం పట్టుకుని కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ చాలా క్యూరియాసిటీని పెంచుతోంది.


ఊరు పేరు భైరవకోనలో సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ఉండ‌డబోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిని టీజర్ మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకోగా సినిమాపై అంచనాల‌ను రెట్టింపు చేశాయి. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర (Shekar Chandra) సంగీతం అందించగా మొదటి రెండు పాటలు- నిజమే నే చెబుతున్నా, హమ్మా హమ్మా ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి.

వర్ష బొల్లమ్మ (Varsha Bollamma), కావ్యా థాపర్ (Kavya Thapar) కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, ఎ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్. భాను భోగవరపు, నందు సవిరిగాన ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు.

Updated Date - Jan 10 , 2024 | 05:53 PM