Subbaraju: సుబ్బరాజు వైఫ్ బ్యాక్‌గ్రౌండ్ తెలుసా.. అమెరికాలో పెద్ద
ABN , Publish Date - Nov 29 , 2024 | 07:25 AM
సైలెంట్‌గా పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన టాలీవుడ్ నటుడు సుబ్బరాజు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నారు. ఆయన భార్య ఎవరంటూ నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి మీకు తెలుసా..
ఖడ్గం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న యాక్టర్ పెనుమత్స సుబ్బరాజు సంతోష్ అలియాస్ సుబ్బరాజు. 47 ఏళ్ళు వచ్చిన ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తెచ్చిన ఆసక్తి లేదని చెప్పే ఆయన సైలెంట్‌గా పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేస్తూ అందరితో పంచుకోగా వైరల్ గా మారింది. దీంతో సుబ్బరాజు భార్య ఎవరు? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటని ఆరాలు తీస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే..
సుబ్బరాజు భార్య పేరు స్రవంతి. స్రవంతి అమెరికాలోని ఫ్లోరిడాలో నార్త్వుడ్ డెంటల్ సెంటర్స్లో డెంటిస్ట్గా పనిచేస్తున్నారు. కొలంబియా యూనివర్సిటీ, జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీల నుండి ఆమె BDS, DDS, MPH డిగ్రీలు పొందారు. స్రవంతి ఫిట్నెస్ ఫ్రీక్. ఆమెకి సైన్స్ అంటే విపరీతమైన ఆసక్తి. చాలా ఏళ్ల క్రితం స్రవంతి ఫ్యామిలీ అమెరికాలో ఫ్లోరిడాలో స్థిరపడింది. ఇక ఆడంబరాలకు దూరంగా ఉండే సుబ్బరాజు తన వివాహాన్ని చాలా సింపుల్ గా చేసుకున్నారు. పెళ్లి అమెరికాలో చేసుకున్నప్పటికీ త్వరలోనే హైదరాబాద్ లో రిసెప్షన్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
డైరెక్టర్ కృష్ణవంశీ ఇంటికి కంప్యూటర్ మెకానిక్ గా వెళ్లిన సుబ్బరాజు యాక్టర్ గా బయటికొచ్చారు. ఆ తర్వాత వరుసగా పూరి జగన్నాధ్ సినిమాలతో పాటు టాప్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ నటిస్తున్నారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ భీమవరంలో పుట్టిన ఆయన ఇప్పటికి 100కు పైగా చిత్రాల్లో నటించారు.