Baahubali: Crown of Blood: ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన రాజ‌మౌళి

ABN , Publish Date - Apr 30 , 2024 | 09:51 PM

ఎన్నాళ్ల నుంచో వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తున్న ‘బాహుబలి’ యానిమేష‌న్‌కు సంబంధించి ఎట్ట‌కేల‌కు అప్డేట్ వ‌చ్చింది.

Baahubali: Crown of Blood: ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన రాజ‌మౌళి
bahubali

ఎన్నాళ్ల నుంచో వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తున్న ‘బాహుబలి’ (Baahubali) యానిమేష‌న్‌కు సంబంధించి ఎట్ట‌కేల‌కు అప్డేట్ వ‌చ్చింది. రెండు భాగాలుగా వ‌చ్చిన ఈ బాహుబ‌లి చిత్రం ఒక‌దాన్ని మించి మ‌రోటి భారీ విజ‌యాన్ని సాధించి వెయ్యి కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టి పెను సంచ‌ల‌నం సృష్టించింది. ప్ర‌పంచం మొత్తాన్ని భార‌త‌దేశం వైపు తిరిగి చూసేలా చేసిన బాహుబ‌లి సినిమా విడుద‌లై ఏడెనిమిది సంవ‌త్స‌రాలైన నిత్యం ఎక్క‌డో చోట ఈ సినిమా పేరు వినిపిస్తూ ప్ర‌తి ప్రేక్ష‌కుడి మ‌న‌సులో స‌జీవంగా నిలిచింది.

GMbACFKaAAAhxa0.jpeg


అయితే ఈ ‘బాహుబలి’ (Baahubali) పేరు చిర‌కాలం నిలిచేలా చేస్తూ ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి (SS Rajamouli) తాజాగా ఓ కీల‌క విష‌యం అధికారికంగా ప్ర‌క‌టించారు. ‘బాహుబలి (క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌)’ పేరుతో యానిమేటెడ్‌ సిరీస్‌ రాబోతున్నట్లు వెళ్ల‌డించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను కూడా విడుదల చేయ‌నున్న‌ట్లు ప్రకటించారు. ‘మాహిష్మతి ప్రజలు అతడి పేరును మంత్రంలా జపిస్తున్నప్పుడు, ఈ విశ్వంలోని ఏ శక్తి అతడు తిరిగి రావడాన్ని ఆపలేదు. ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’ యానిమేటెడ్‌ సిరీస్‌ ట్రైలర్‌ రాబోతోంది’ అంటూ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశారు. రాజ‌మౌళి అలా పోస్టు పెట్ట‌గానే స‌ద‌రు వార్త‌ సామాజిక మాధ్య‌మాల్లో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. కొద్ది రోజుల్లో మేక‌ర్స్‌ మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేయ‌నున్నారు.

Updated Date - Apr 30 , 2024 | 10:01 PM