Sree leela: శ్రీలీల‌.. ఇది ఏం మాయ‌! చెన్నెలో రేంజ్ మాములుగా లేదుగా

ABN , Publish Date - Mar 25 , 2024 | 01:24 PM

తెలుగునాట‌ వ‌రుస చిత్రాల‌తో దూసుకుపోతోంది క‌థానాయిక శ్రీలీల. తాజాగా చైన్నైలో ఓ క‌ళాశాల‌ వార్షికోత్స‌వానికి హీరో శివ కార్తికేయ‌న్‌తో క‌లిసి శ్రీలీల గెస్ట్‌గా హ‌జ‌రై ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

Sree leela: శ్రీలీల‌.. ఇది ఏం మాయ‌!  చెన్నెలో రేంజ్ మాములుగా లేదుగా
sree leela

టాలీవుడ్‌లో ఆగ్ర‌భాగాన దూసుకుపోతున్న క‌థానాయిక శ్రీలీల (Sree leela). పూజా హెగ్డే,ర‌ష్మిక మంద‌న్నా వంటి వారిని వెన‌క్కి నెట్టి తెలుగు నాట వ‌రుస చిత్రాల‌తో దూసుకుపోతూ హ‌య్యెస్ట్ పేయిడ్ క‌థానాయిక‌గా పేరు సంపాదించింది. సంక్రాతికి విడుద‌లైన గుంటూరు కారం సినిమాలో చివ‌రి సారిగా క‌నిపించిన శ్రీలీల (Sree leela) ప్ర‌స్తుతం ఒక్క ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమాలో మాత్ర‌మే న‌టిస్తోంది. త‌న డాక్ట‌ర్ కోర్స్ ఫైన‌ల్ స్టేజ‌స్‌లో ఉండ‌డంతో సినిమాల‌కు కాస్త విరామం ప్ర‌క‌టించింది.

sreleela 3.jpeg

అడ‌పాద‌డ‌పా ఈ మ‌ధ్య ఎక్కువ‌గా ప్రైవేట్ కార్య‌క్ర‌మాల‌లో మాత్ర‌మే క‌నిపోస్తోన్న ఈ ముద్దుగుమ్మ చాలా జ్యెవెల‌రీ , బ‌ట్ట‌ల షాప్ ల‌కు అంబాసిడ‌ర్‌గా సైన్ చేసింది. ఈ క్ర‌మంలో వాటి అడ్వ‌ర్టైజ్‌మెంట్లలో న‌టిస్తూ బిజీగా ఉంటోంది. తాజాగా చైన్నైలో ఓ ప్రైవేట్ మెడిక‌ల్ నిర్వ‌హించిన వార్షికోత్స‌వానికి త‌మిళ స్టార్ హీరో శివ కార్తికేయ‌న్‌తో క‌లిసి శ్రీలీల (Sree leela) గెస్ట్‌గా హ‌జ‌రై ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.


అయితే.. ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న క్ర‌మంలో అక్క‌డ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న యూనివ‌ర్సిటీ విద్యార్థుల‌తో పాటు నిర్వాహ‌కులు, యాజ‌మాన్యం చూపంతా శ్రీలీల (Sree leela) పైనే ఉందంటే అతిశ‌యోక్తి కాదు. ఆ ప్రోగ్రాం జ‌రుగున్నంత సేపు త‌న హ‌వాభావాల‌తో, న‌వ్వుతో, త‌న మాట‌ల‌తో అక్క‌డి వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. హీరో శివ కార్తికేయ‌న్‌తో గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మ‌డ‌త పెట్టి పాట‌కు స్టెప్పులు వేయించి కార్య‌క్ర‌మానికి జోష్ నింపింది.

sree leela

అంతే కాదు శివ కార్తికేయ‌న్ తెలుగులో మాట్లేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. క‌రెక్టే మట్లాడుతున్నారు.. మాట్లాడండి అంటూ సైగ‌లు చేస్తూ ఉత్సాహ ప‌రిచింది. ఇప్పుడు ఈ వీడియోలు, ఫొటోలు సోష‌ల్ మీడియాలో నిన్న‌టినుంచి వీప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి. ఆ వీడియో, ఫొటోల్లో శ్రీలీల(Sree leela) ను చూసి అమె ఫ్యాన్స్‌తో పాటు నెటిజ‌న్లు ఆ క్యూట్‌నెస్‌కు, ఆ న‌వ్వుకు ఫిధా అవుతున్నారు. మీరింత‌వ‌ర‌కు చూడ‌లేదా.. ఇప్పుడే చూసేయండి మ‌రి.

Updated Date - Mar 25 , 2024 | 01:24 PM