నాగ చైతన్య, సాయి పల్లవి 'తండేల్' కీలక సన్నివేశాల చిత్రీకరణ

ABN , Publish Date - Feb 06 , 2024 | 12:40 PM

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకుడిగా వస్తున్న 'తండేల్' సినిమా కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించినట్టుగా తెలిపారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

నాగ చైతన్య, సాయి పల్లవి 'తండేల్' కీలక సన్నివేశాల చిత్రీకరణ
Naga Chaitanya, Bunny Vas and Chandoo Mondeti on the sets of Thandel

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా 'తండేల్' సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అతను, నాగ చైతన్య ఇంతకు ముందు రెండు సినిమాలు కలిపి చేశారు, ఇప్పుడు ఇది మూడో సినిమా. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో భారీ బడ్జెట్ తో నిర్మాత బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర యూనిట్ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్టుగా ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

saipallavithandelworkingsti.jpg

ఈ షెడ్యూల్ లో నాగ చైతన్య, సాయి పల్లవి, ఇతర తారాగణంపై సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలని చిత్రీకకరీంచారు. అలాగే ఈ సినిమా వర్కింగ్ స్టిల్స్ ని కూడా చిత్ర నిర్వాహకులు విడుదల చేశారు. దర్శకుడు చందూ మొండేటి ఒక యదార్ధ సంఘటన ఆధారంగా ఈ 'తండేల్' కథని తయారు చేసారు. అందుకనే ఈ చిత్రాన్ని చాలా రియలిస్టిక్ గా తీస్తున్నట్టుగా చెపుతున్నారు. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించడం కోసం సుందరమైన, సహజసిద్ధమైన లోకేషన్స్ లో చిత్రాన్ని షూట్ చేస్తున్నారు అని చెప్పారు.

nagachaitanyathandel.jpg

ఇప్పటికే విడుదలైన 'తండేల్' ప్రమోషనల్ కంటెంట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఎసెన్స్ అఫ్ 'తండేల్' గ్లింప్స్ ఈ సినిమా ఎలా వుండబోతోంది అనే విషయాన్ని చూచాయిగా చెప్పడమే కాకుండా, ఈ సినిమాపై అంచనాలని భారీగా పెంచింది. ఈ చిత్రంలో రాజు అనే జాలరి పాత్రలో నాగ చైతన్య నటిస్తుండగా, అతని మనసుని గెలుచుకున్న అమ్మాయిగా సాయి పల్లవి కనిపిస్తోంది. నాగ చైతన్య ఇందులో తన పాత్ర కోసం కంప్లీట్ గా మేక్ఓవర్ అయ్యారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, నేపధ్య సంగీతం అందిస్తుండగా, షామ్‌దత్ కెమెరామ్యాన్ గా పని చేస్తున్నారు.

Updated Date - Feb 06 , 2024 | 12:40 PM