SLV Cinemas: 90వ దశకానికి చెందిన పీరియాడిక్  డ్రామా 

ABN , Publish Date - Jan 21 , 2024 | 05:22 PM

దీక్షిత్ శెట్టి‌,  శశి ఓదెల హీరోలుగా  ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.8 సినిమా రూపొందనుంది. కె.కె దర్శకత్వంలో సుధాకర్ చెెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శశి ఓదెల ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు.

SLV Cinemas: 90వ దశకానికి చెందిన పీరియాడిక్  డ్రామా 

దీక్షిత్ శెట్టి‌,  శశి ఓదెల హీరోలుగా  ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.8 సినిమా రూపొందనుంది. కె.కె దర్శకత్వంలో సుధాకర్ చెెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శశి ఓదెల ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. డిఫరెంట్ స్టోరీతో 90వ దశకానికి చెందిన పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా సినిమా తెరకెక్కనుండటం విశేషం. పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నగేష్ బన్నెల్ సినిమాటోగ్రాఫర్‌గా, కార్తీక శ్రీనివాస్.ఆర్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సహా మిగతా వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. 


Updated Date - Jan 21 , 2024 | 05:22 PM