Siva Nagu: సినిమాతోనే ప్రాణం వదులుతాను     

ABN , Publish Date - Jan 21 , 2024 | 04:37 PM

ఇనయ సుల్తానా, సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్,  తాగుబోతు రమేశ్ కీలక  పాత్రల్లో నటించిన చిత్రం 'నటరత్నాలు'.  చందనా ప్రొడక్షన్ సమర్పణలో ఎవరెస్ట్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం  క్రైం కామెడీ థ్రిల్లింగ్ నేపథ్యంలో తెరకెక్కింది.   శివనాగు దర్శకుడు. ఈ సినిమా  ట్రైలర్ ఇటీవల ప్రసాద్ లాబ్స్ లో విడుదల చేసారు.

Siva Nagu: సినిమాతోనే ప్రాణం వదులుతాను      

ఇనయ సుల్తానా, సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్,  తాగుబోతు రమేశ్ కీలక  పాత్రల్లో నటించిన చిత్రం 'నటరత్నాలు'.  చందనా ప్రొడక్షన్ సమర్పణలో ఎవరెస్ట్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం  క్రైం కామెడీ థ్రిల్లింగ్ నేపథ్యంలో తెరకెక్కింది.   శివనాగు దర్శకుడు. ఈ సినిమా  ట్రైలర్ ఇటీవల ప్రసాద్ లాబ్స్ లో విడుదల చేసారు. ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ , దర్శకుడు కె ఎస్ రవికుమార్ చౌదరి, దర్శకుడు సముద్ర, డీ. ఎస్. రావు తదితరులు పాల్గొన్నారు.

నిర్మాత దామోదర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ : ప్రతి ఇండస్ట్రీలో కష్టసుఖాలు ఉంటాయి, ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి మన కష్టాలు ఎక్కువ కనబడతాయి అవన్నీ అధిగమించి నిలబడ్డమే కళ, ఇక్కడ ఉన్న వాళ్ళే దానికి నిదర్శనం. 'నటరత్నలు' జాతి రత్నాలు లా ఉంది పేరు అంతే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ చాలా బాగుంది. ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్ శివ నాగు కి ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ " స్టీల్ ని కూడా కొలిమిలో కాలిస్తేనే ఖడ్గం లా మారుతుంది. అలా ఖడ్గంగా మారి ఉన్న వ్యక్తిత్వమే శివనాగుది.  సినిమా ఇండస్ట్రీలో కష్టాలు ఉంటాయి. ఎన్ని కష్టాలు ఉన్నా ఇండస్ట్రీలో నిలబడితేనే సక్సెస్. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక వ్యవస్థ. సినిమా ఇండస్ట్రీలో వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు కానీ సినిమా ఎప్పుడు నిలకడగానే ఉంటుంది. మనిషికి కష్టాలున్నా బాధలున్నా ముందు వచ్చే ఆలోచన ఒక సినిమా చూడాలి. డైరెక్టర్ శివ నాగు ది కష్టపడే వ్యక్తిత్వం, 24 క్రాఫ్ట్స్ ని  హ్యాండిల్ చేయగలిగిన వ్యక్తి" అని అన్నారు. 

దర్శకుడు శివనాగు మాట్లాడుతూ "సినిమా అంటే నాకు ప్రాణం సినిమానే నా జీవితం. సినిమా కోసం పుట్టాను సినిమాతోనే ప్రాణం వదులుతాను.  సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీయాలి అనే వాళ్ళు ఎలా విఫలమవుతున్నారు? ఎలా సఫలమవుతున్నారు? ఏం చేస్తున్నారు అనే కథగా ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్రతి సినిమా సక్సెస్ కి ప్రమోషన్స్ కారణం. సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రమోషన్స్ చేస్తూనే ఉంటాను.   అతి త్వరలో సినిమా మీ ముందుకు రాబోతుంది" అని చెప్పారు. 

నిర్మాత చంటి యలమాటి మాట్లాడుతు " హిట్లు ఇచ్చిన డైరెక్టర్లను యాక్టర్లుగా మార్చిన సినిమా నటరత్నాలు. సూర్యకిరణ్ లో ఒక నటుడిని చూస్తారు. నేను 2002లో సినిమా మీద ఇంట్రెస్ట్ తో సినిమా ప్రొడ్యూస్ చేయాలని వచ్చాను. కానీ కొన్ని అనుకోని సంఘటన వల్ల లాస్ అయ్యాను. మళ్లీ చాలాకాలం తర్వాత డైరెక్టర్ శివ నాగు నాకు ఈ నటరత్నాలు కథ చెప్పడం జరిగింది. ఈ కథ సినిమాలో సినిమా లాంటిది.  అతి త్వరలో సినిమా మీ ముందుకు తీసుకురాబోతున్నాం" అన్నారు. 

Updated Date - Jan 21 , 2024 | 04:37 PM