Sreeleela: శివ కార్తికేయ‌న్‌తో.. ‘కుర్చీ మ‌డ‌త‌పెట్టి’ స్టెప్పులేయించిన శ్రీలీల‌

ABN , Publish Date - Mar 25 , 2024 | 06:43 AM

గుంటూరు కారం సినిమా విడుదలై 60 రోజులు దాటినా నిత్యం ఏదోరకంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తూ వస్తూనే ఉంది. తాజాగా కుర్చీ మడత పెట్టి పాట‌కు కార్తికేయన్, శ్రీలీల డ్యాన్స్ వీడియో బాగా వైర‌ల్ అవుతోంది.

Sreeleela: శివ కార్తికేయ‌న్‌తో.. ‘కుర్చీ మ‌డ‌త‌పెట్టి’ స్టెప్పులేయించిన శ్రీలీల‌
sree leela

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), శ్రీలీల (Sree Leela) జంటగా గత సంక్రాంతికి విడుదలై మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న చిత్రం గుంటూరు కారం (Guntur kaaram). ఈ సినిమా విడుదలైన్నప్పటి నుంచి ఏదోరకంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తూ వస్తూనే ఉంది. ముక్యంగా సినిమాలోని కుర్చీ మడత పెట్టి (Kurchini Madhathapetti) అనే పాట ప్రపంచవ్యాప్తంగా దుమ్ము రేపుతోంది. రీల్స్ ఓ రేంజ్ లో చేస్తూ సినిమా పేరును , పాటను ఇప్పటికీ లైవ్ లోనే ఉంచుతున్నారు.

sree.jpeg

తాజాగా చెన్నైలో ఓ ప్రవేట్ కళాశాల యానివర్సరీ వేడుక జరగగా ఆ కార్యక్రమానికి తమిళ స్టార్ నటుడు శివ కార్తికేయన్ (Siva Karthikeyan) , హీరోయిన్ శ్రీలీల(Sree Leela)లు గెస్ట్ లుగా హజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఒకరికొకరి గురించి మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో స్టేజిపై ఉన్న శ్రీలీల (Sree Leela) మాట్లాడుతూ శివ కార్తికేయన్ (Siva Karthikeyan) కొత్త నటులకు ఆదర్శమని పొగడ్తలలో ముంచెత్తింది.


leela.jpegఅయితే.. అదే సమయంలో కుర్చీ మడత పెట్టి (Kurchini Madhathapetti) పాటకు డ్యాన్స్ చేయాలని అక్కడ ఉన్న వారంతా కోరడంతో శివ కార్తికేయ‌న్ (Siva Karthikeyan) తో కలిసి శ్రీలీల (Sree Leela) ఈ పాటకు స్టెప్పులు వేసింది. ఇప్పుడు ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియలో బాగా వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.

Updated Date - Mar 25 , 2024 | 06:43 AM