Singer Sunitha: చివరి దశలో ఉన్న క్యాన్సర్‌ పేషెంట్స్‌ కోసం ఏం చేస్తుందో తెలుసా?

ABN , Publish Date - Mar 10 , 2024 | 05:16 PM

కొందరు ఫీమేల్‌ సింగర్స్‌ కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడు హఠాత్తుగా మాయం అవ్వడానికి కారణం చెప్పారు గాయని సునీత (Singer Sunitha). తాజాగా 'నవ్య'కు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాజహితం కోసం ఆమె ఏం చేస్తున్నారో చెప్పారు.

Singer Sunitha: చివరి దశలో ఉన్న క్యాన్సర్‌ పేషెంట్స్‌ కోసం ఏం చేస్తుందో తెలుసా?

కొందరు ఫీమేల్‌ సింగర్స్‌ కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడు హఠాత్తుగా మాయం అవ్వడానికి కారణం చెప్పారు గాయని సునీత (Singer Sunitha). తాజాగా 'నవ్య'కు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాజహితం కోసం ఆమె ఏం చేస్తున్నారో చెప్పారు. "కొందరు సింగర్స్‌ ఒక వయసు వచ్చాక ఉన్నట్టుంటి పాటకు దూరం అవుతారు. ఫిమేల్‌ సింగర్స్‌ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మహిళల శరీరంలో ఈస్ట్రోజిన్‌ అనే హార్మోన్‌ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. 40ల తర్వాత గాయనీమణుల శరీరంలో మార్పులు వస్తాయి. ఆ ప్రభావం గొంతుపై కూడా పడుతుంది. గొంతు డ్రై అయిపోతుంది.

Sunitha.jpg

చిన్నప్పటి నుంచి సాధన ఉండి ఆత్మవిశ్వాసం ఉన్న సింగర్స్‌ మరో పదేళ్లపాటు పాడగలుతారు. ఈ విషయాన్ని అంగీకరించి, ప్రతికూల ఆలోచనలను దరిచేరనివ్వకపోతే సమస్యలు రావు. పాడటం అనేది దేవుడు కొందరికి మాత్రమే ఇచ్చిన వరం. కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసే శక్తి ఉంటుంది. అందువల్ల దానిని సమాజహితానికి వాడుకుంటే మంచిది. నేను చేసే కార్యక్రమాల గురించి చెప్పటం నాకు ఇష్టం ఉండదు. అయినా అడిగారు కాబట్టి చెబుతున్నా.. చివరి దశలో ఉన్న క్యాన్సర్‌ పేషెంట్లకు మందులు పనిచేయవు. అలాంటి వారి దగ్గరకు వెళ్లి పాటలు పాడుతుంటా. దానివల్ల వారికి స్వాంతన లభిస్తుంది. నాకు మానసికంగా నాకు మానసికంగా తృప్తిగా అనిపిస్తుంది’’ అని తెలిపారు.

Updated Date - Mar 10 , 2024 | 05:16 PM