Singer Geetha Madhuri: సింగర్‌ గీతా మాధురి మరోసారి తల్లి కాబోతోంది!

ABN , Publish Date - Feb 01 , 2024 | 09:31 PM

గాయని గీతామాధురి మరోసారి తల్లి కాబోతున్నారు. నందు- గీతా దంపతులకు ఇప్పటికే దాక్షాయని అనే కూతురు ఉంది. ఫిబ్రవరిలో దాక్షాయనికి తోడుగా ఓ బుజ్జాయి రానుంది.

Singer Geetha Madhuri: సింగర్‌ గీతా మాధురి మరోసారి తల్లి కాబోతోంది!

గాయని గీతామాధురి మరోసారి తల్లి కాబోతున్నారు. నందు- గీతా దంపతులకు ఇప్పటికే దాక్షాయని అనే కూతురు ఉంది. ఫిబ్రవరిలో దాక్షాయనికి తోడుగా ఓ బుజ్జాయి రానుంది. ఈ విషయాన్ని గత డిసెంబర్‌లో వెల్లడించారు గీతా మాధురి. తాజాగా ఆమెకు సీమంతం జరిగింది. కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ సీమంతం ఫంక్షన్‌లో గీతా.. ఆకుపచ్చ- నారింజ కాంబినేషన్‌లో ఉన్న శారీలో మెరిశారు. క్యూట్‌ దాక్షాయణి ప్రకృతి ఫిబ్రవరిలో అక్క కాబోతుంది అని గత ఏడాది నందూ ఇనస్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. సీమంతానికి  సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. టాలీవుడ్‌లో ఎన్నో క్లాస్‌, మాస్‌ పాటలు పాడిన గీతా మాధురి ప్రస్తుతం పలు మ్యూజిక్‌ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.

Untitled-2.jpgGeetha-maduri.jpg

Updated Date - Feb 01 , 2024 | 09:35 PM