Tillu Square Trailer : ప్రేమికుల‌రోజున‌.. రాములు థియేట‌ర్‌లో టిల్లు ర‌చ్చ‌ర‌చ్చే

ABN , Publish Date - Feb 13 , 2024 | 04:14 PM

డీజే టిల్లు వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత జిద్దు జొన్న‌ల‌గ‌డ్డ, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా రూపొందుతున్న చిత్రం ‘టిల్లు స్వ్కేర్‌’. తాజాగా చిత్రం ట్రైల‌ర్ గురించి మేక‌ర్స్‌ ఆప్డేట్ ఇచ్చారు.

Tillu Square Trailer : ప్రేమికుల‌రోజున‌.. రాములు థియేట‌ర్‌లో టిల్లు ర‌చ్చ‌ర‌చ్చే
tillu

డీజే టిల్లు వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత జిద్దు జొన్న‌ల‌గ‌డ్డ (Starboy Siddhu), అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ (Anupama Parameswaran) జంట‌గా రూపొందుతున్న చిత్రం ‘టిల్లు స్వ్కేర్‌’ (Tillu Square). ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్స్‌, గ్లింప్స్‌, రెండు పాట‌లు చిత్రంపై అంచ‌నాల‌ను రెండింత‌లు పెంచేసింది. రెండు రోజుల క్రితం సిద్ధు బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఓ గ్లిమ్స్ రిలీజ్ చేయ‌గా ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ ‘టిల్లు స్వ్కేర్‌’ మొద‌టి భాగం డీజే టిల్లును మించి రెట్టింపు వినోదంతో రూపోందుతున్న‌ద‌ని ఇప్ప‌టికే ప‌లుమార్లు చెబుతూ వ‌చ్చిన మేక‌ర్స్ తాజాగా చిత్రం ట్రైల‌ర్ గురించి ఆప్డేట్ ఇచ్చారు.


సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments), ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ (Fortune Four Cinemas) సంయుక్తంగా శ్రీకర స్టూడియోస్ (Srikara Studios) సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. డీజే టిల్లుకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ మల్లిక్ రామ్ (Mallik Ram) ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తుండ‌గా, రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. (Tillu Square Release Date) ఇదిలా ఉండ‌గా అయితే ఫిబ్ర‌వ‌రి 14 ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా మూసాపేట్ శ్రీరాములు థియేట‌ర్‌లో సాయంత్రం 5 గంట‌ల 4 నిమిషాల‌కు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉండ‌గా ఈ సినిమాను మార్చి 29న‌ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Updated Date - Feb 13 , 2024 | 04:14 PM