Siddharth Roy: ఎక్స్ ట్రీంలో బ‌తికే జీనియస్.. ఎమోషనల్ ఎందుక‌య్యాడ‌నేదే ‘సిద్ధార్థ్ రాయ్’

ABN , Publish Date - Feb 22 , 2024 | 09:17 PM

టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోలతో పనిచేసిన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్, యంగ్ హీరో దీపక్ సరోజ్ ‘సిద్ధార్థ్ రాయ్’ తో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల వద్ద పనిచేసిన వి యశస్వీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Siddharth Roy: ఎక్స్ ట్రీంలో బ‌తికే జీనియస్.. ఎమోషనల్ ఎందుక‌య్యాడ‌నేదే ‘సిద్ధార్థ్ రాయ్’
SiddharthRoy

టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోలతో పనిచేసిన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్, యంగ్ హీరో దీపక్ సరోజ్ (Deepak Saroj) ‘సిద్ధార్థ్ రాయ్’ (Siddharth Roy) తో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల వద్ద పనిచేసిన వి యశస్వీ (Yeshasvi) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెం 1గా జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయినలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్, ట్రైలర్, పాటలు హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన, స్టార్ రైటర్ కోన వెంకట్ ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ..‘సిద్ధార్థ్ రాయ్’ మూవీ గురించి చాలా మంచి విషయాలు విన్నాను. దర్శకుడు యశస్వీ గారు, సినిమా టీం అంతా చాలా కష్టపడి పాషన్ ఈ సినిమా చేశారు. చాలా ఇంటెన్స్ పాయింట్ తో సినిమా తీశారు. చూసిన వారు చాలా అద్భుతంగా వుందని చెప్పారు. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. హిట్ అవుతుందనే నమ్మకం వుంది. ఈ చిత్ర నిర్మాతలు మరిన్ని గొప్ప సినిమాలు చేయాలి. దీపక్ చాలా ఇంటెన్స్ వున్న రోల్ ని చాలా అద్భుతంగా చేశారు. మొదటి సినిమాకే అన్ని ఎమోషన్స్ ని ప్రదర్శించడం మామూలు విషయం కాదు. తొలి సినిమాకే ఇంత వైవిధ్యమైన పాత్ర దక్కడం చాలా అరుదు. అదే తన తొలి విజయం. సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. టీజర్ ట్రైలర్ చాలా బావున్నాయి. సినిమా కూడా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది. అందరూ థియేటర్స్ లో సినిమా చూసి సపోర్ట్ చేయండి'' అని కోరారు.

siddharthroystills.jpg

రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ.. కంటెంట్ కి మించిన స్టార్ లేరు. అలాంటి కంటెంట్ ని రాశారు దర్శకుడు యశస్వీ. నేను ఎందుకు ఇలాంటి కంటెంట్ రాయలేకపోయాననే జెలసీ వచ్చింది. ఇలాంటి ఫీలింగ్ వచ్చిదంటే ఖచ్చితంగా అది బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ కంటెంట్ నా దగ్గరకి ఎందుకు రాలేదు ? దీపక్ ని నేను ఎందుకు పరిచయం చేయలేదు? నాకు ఈ రెండు రిగ్రెట్స్ వున్నాయి. టీజర్ లో దీపక్ ని చూసి ఆశ్చర్యపోయాను. విజువల్స్ అద్భుతంగా వుంది. ఇందులో కథ, క్యారెక్టర్స్, టెక్నికల్ వర్క్ అన్ని అద్భుతంగా వున్నాయి. మనసున్న ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమాకి వస్తారనే నమ్మకం వుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ‘సిద్ధార్థ్ రాయ్' ఆల్రెడీ సక్సెస్ ఫుల్ ఫిల్మ్'' అన్నారు.

డైరెక్టర్ త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. ఈ వేడుకలో భాగం కావడం ఆనందంగా వుంది. దీపక్ సినిమా గురించి ఇంత నమ్మకంగా మాట్లాడట నచ్చింది. తన లుక్ వాయిస్ చాలా బావున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తను హీరో కావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. దర్శకుడు యశస్వీ చాలా కాలంగా నాకు తెలుసు. చాలా కష్టపడ్డాడు. అర్జున్ రెడ్డి ఒక దేవదాస్ సినిమా తీసి పెద్ద హిట్ కొట్టారు. ‘సిద్ధార్థ్ రాయ్' ఒక గౌతమ బుద్ధ సినిమా తీశాడు. దేవదాస్ ఎంత హిట్టు కొట్టాడో గౌతమ బుద్ధ అంత హిట్ కొట్టాలి. తప్పకుండా సినిమా చూసి అంత హిట్ ఇవ్వాలి. సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. ప్రేక్షకులు సినిమా చూసి పెద్ద హిట్ ఇచ్చి టీంని బ్లెస్ చేయండి'' అని కోరారు.


హీరో దీపక్ సరోజ్ మాట్లాడుతూ.. ‘సిద్ధార్థ్ రాయ్’ ఇంటెల్జెంట్, జీనియస్. ఒక రాంగ్ ఫిలాసఫీలో ఇరుక్కుపోయి జీవితాన్ని ఒక ఎక్స్ ట్రీం పాయింట్ బ్రతుకుతుంటాడు. అలాంటి వ్యక్తి ఎమోషనల్ ఎలా అయ్యాడు? ఎందుకయ్యాడు? ప్రేమలో ఎందుకు పడ్డాడు ? ఈ కథ విన్నప్పుడు ఆకలితో వున్న ఒక నటుడికి ఇంతకంటే మంచి పాత్ర వస్తుందా ? అనిపించింది. కథ విన్నాక ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఇలాంటి పాత్రతో నన్ను నేను నిరూపించుకోవచ్చని ఈ సినిమా చేశాను. ఈ పాత్రలో నన్ను నమ్మి అడిషన్ కూడా చేయకుండా నన్ను ఎంపిక చేసిన దర్శకుడు యశస్వీ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. తన్వి చాలా నిజాయితీగా తన పాత్రని చేసింది. ఇందులో తన పాత్ర ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. అలాగే కీర్తన కూడా చక్కగా నటిచింది. ఈ సినిమా ముందుకు వెళ్ళడానికి కారణం నిర్మాత ఫణిగారు. చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా టీం సమిష్టి కృషి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి థాంక్స్. శ్యాం గారు, ప్రవీణ్ పూడి గారు చాలా సపోర్ట్ చేశారు. రధన్ గారు సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సినిమాపై చాలా బజ్ వుంది. ఈ వేడుకకు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన కిరణ్ అబ్బవరం, డైరెక్టర్ త్రినాథరావు నక్కిన, కోన వెంకట్ గారికి ధన్యవాదాలు. చాలా ఇంటెన్స్ పాషన్ తో ఈ సినిమా చేశాం. తప్పకుండా థియేటర్స్ లో చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం వుంది. మీ అందరి స్పందన కోసం ఎదురుచూస్తున్నాం. ఈ పాత్ర ప్రేక్షకుల మనసులో గుర్తిండిపొతుందని నమ్ముతున్నాను. థియేటర్స్ లో కలుద్దాం'' అన్నారు.

చిత్ర దర్శకుడు వి యశస్వీ మాట్లాడుతూ..చిన్నప్పటి నుంచి సినిమాలంటే పాషన్. చదువుపూర్తయ్యాక సెంట్రల్ గవర్నమెంట్ లో 12 ఏళ్ల పాటు ఉద్యోగం చేశాను. ఐతే సినిమాలపై వున్న ఇష్టంతో పరిశ్రమలోకి వచ్చాను. ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన నా ఫ్యామిలీకి కృతజ్ఞతలు. నాకున్న పరిచయాలతో సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ సులువుగా దొరికింది. హరీష్ శంకర్ గారి రామవయ్య వస్తావాయ్య , వంశీ పైడిపల్లి గారి దగ్గర ఊపిరి సినిమాలకు సహాయ దర్శకుడిగా చేశాను. తర్వాత దర్శకుడు కావాలని సొంతగా ప్రయత్నాలు చేశాను. అయితే ఈ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పరిశ్రమ వదిలి వైజాగ్ వెళ్ళిపోయాను. కానీ సినిమాపై పాషన్ మాత్రం వుండనివ్వలేదు. సొంతగా సినిమా చేయాలని నిర్ణయించుకొని ఈ కథ రాశాను. పరిశ్రమలో చాలా మందికి ఈ కథ చెప్పాను. అందరికీ నచ్చుతుంది కానీ భయాలు ఎక్కువున్నాయి. చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ ఇది. ఇలా ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే కోవిడ్ బారిన పడ్డాను. చాలా సీరియస్ గా ఎఫెక్ట్ అయ్యింది. దిని నుంచి బయటపడితే మాత్రం సిద్ధార్థ్ రాయ్’ సినిమా చేయాలని బలంగా అనుకున్నాను. లక్కీగా బయటపడ్డాను. తర్వాత నిర్మాతల వద్దకు వెళ్ళలేదు. సొంతగా చేయాలని నా ప్రాపర్టీ అమ్మకానికి పెట్టాను. కానీ ఆ డబ్బు సరిపోదు. దీపక్ కి ఈ కథ చెప్పాను. తనకి చాలా నచ్చింది. తర్వాత ఫణి గారు రావడంతో సినిమా మొదలైయింది.

73634121-5f24-4643-a2dd-bfe1f16ca40e.jpg

యూనిట్ అంతా తమ సొంత సినిమాగా చేశారు. అయితే సంగీత దర్శకుడు రధన్ కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమైయింది. సుకుమార్ గారికి ఈ సినిమా టీజర్ పెట్టాను. ఆయన విపరీతంగా ఎక్సయిట్ అయ్యారు. సినిమా ఫస్ట్ హాఫ్ చూసి హాగ్ ఇచ్చి.. సినిమా అదిరిపోయింది. నీ నెక్స్ట్ సినిమా నా బ్యానర్ లోనే’ అని అనౌన్స్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. నిజానికి ఆయనతో నాకు పరిచయం కూడా లేదు. సినిమా కంటెంట్ నచ్చి ఇంత సపోర్ట్ చేసిన సుకుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన వలనే సినిమాకి ఒక బజ్ క్రియేట్ అయ్యింది. ఫణి గారు ఈకథని బలంగా నమ్మారు. ప్రదీప్ కూడా చాలా సపోర్ట్ చేశారు. దీపక్ అద్భుతంగా నటించాడు. నేను రాసిన దానికంటే ఒక మెట్టు చక్కగా చేశాడు. తనకి చాలా మంచి భవిష్యత్ వుంటుంది. తన్వి చాలా బలమైన పాత్రలో కనిపిస్తుంది. ఈ వేడుకకు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసిన కిరణ్ అబ్బవరం, డైరెక్టర్ త్రినాథరావు నక్కిన, కోన వెంకట్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరున ధన్యవాదాలు ‘సిద్ధార్థ్ రాయ్’ ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఇలాంటి కథ, క్యారెక్టర్ ఇప్పటివరకూ రాలేదు. సినిమా ప్రేక్షకులని తప్పకుండా ఎంటర్ టైన్ చేస్తుంది’ అన్నారు.

హీరోయిన్ తన్వి (Tanvi Negi ) మాట్లాడుతూ.. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదలు. ఇందులో నేను చేస్తున్న ఇందు పాత్ర చాలా స్పెషల్. దర్శకుడు చాలా అద్భుతంగా ఈ పాత్రని రాశారు. దీపక్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ థాంక్స్. అందరూ సినిమాని థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయాలి’ అని కోరారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ చాలా గ్రాండ్ గా జరిగింది.

Updated Date - Feb 22 , 2024 | 09:17 PM