Siddharth Roy: ఈ వారం వచ్చిన సినిమాల్లో ‘సిద్ధార్థ్ రాయ్’ మంచిగా రన్ అవుతోంది

ABN , Publish Date - Feb 25 , 2024 | 07:24 PM

పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్, యువ న‌టుడు దీపక్ సరోజ్ హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’ ఫిబ్రవరి 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అందరినీ అలరించి యూత్ ఫుల్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ గా అలరిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

Siddharth Roy: ఈ వారం వచ్చిన సినిమాల్లో ‘సిద్ధార్థ్ రాయ్’ మంచిగా రన్ అవుతోంది
Siddharth Roy

పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్, యువ న‌టుడు దీపక్ సరోజ్ (Deepak Saroj) హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’ (Siddharth Roy). హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల వద్ద పనిచేసిన వి యశస్వీ (Yeshsvi) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తన్వి నేగి కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీరాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెం 1గా జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయినలు సంయుక్తంగా నిర్మించారు. ఫిబ్రవరి 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అందరినీ అలరించి యూత్ ఫుల్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ గా అలరిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

ఈ సంద‌ర్భంగా దర్శకుడు యశస్వీ (Yeshsvi) మాట్లాడుతూ.. ‘సిద్ధార్థ్ రాయ్’ (Siddharth Roy) సినిమా థియేటర్స్ లో ఆదరిస్తున్న ప్రేక్షకులకు, ముఖ్యంగా యూత్ కి మా యూనిట్ తరపున ధన్యవాదాలు. థియేటర్స్ లో మంచి ఫుట్ పాల్ వుంది. అన్ని ఏరియాల నుంచి డిస్ట్రిబ్యుటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ఫోన్స్ చేసి ఈ వారం వచ్చిన సినిమాల్లో ‘సిద్ధార్థ్ రాయ్’ మంచి సినిమాగా రన్ అవుతుందని చెప్పడం అనందంగా వుంది. ఈ రోజు ఇంకాస్త మెరుగ్గా ఫుట్ ఫాల్ వుంది. ఈ వీకెండ్ మా సినిమా మరింత ప్రేక్షకుల ఆదరణ అందుకొని ముందుకు వెళ్తుందని భావిస్తున్నామ‌న్నారు. యువ ప్రేక్షకులు ఫస్ట్ హాఫ్ కి చాలా కనెక్ట్ అయ్యారన్నారు. సెకండ్ హాఫ్ కి పెద్దలు, ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యారని, ఒక యునిక్ బ్లెండ్ తో సినిమా ఉంద‌న్నారు. మేము అనుకున్నట్లే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఉంద‌ని, దీపక్, తన్వి పెర్ఫార్మెన్స్ కి మెస్మరైజ్ అవుతున్నారన్నారు పాటలని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మా సినిమా థియేటర్స్ లో ఇంకా బాగా ఆడి మేము అనుకున్నట్లుగా కమర్షియల్ పే అఫ్ ఇస్తుందని నమ్ముతున్నామ‌న్నారు. మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలుస‌స అని తెలిపారు.

WhatsApp Image 2024-02-25 at 6.43.21 PM.jpeg


హీరో దీపక్ సరోజ్ (Deepak Saroj) మాట్లాడుతూ.. ‘సిద్ధార్థ్ రాయ్' (Siddharth Roy) అన్ని చోట్ల ప్రేక్షకులని అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని, ముఖ్యంగా మా హోం టౌన్ వైజాగ్ లో థియేటర్స్ యూఫోరియా చాలా బావుందన్నారు. క్యారెక్టరైజేషన్ కి చాలా బాగా కనెక్ట్ అవుతున్నారని, దర్శకుడు యశస్వీ విజన్‌ను ప్రేక్షకులు చాలా ఇష్టపడ్డారన్నారు. ఇది రెగ్యులర్ సినిమా కాదని, ఓ కొత్త కథని చూడాలనుకునే ప్రేక్షకులని అద్భుతంగా అలరిస్తుందన్నారు. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు సినిమా ఓపెనింగ్, క్లైమాక్స్ కి రివిల్ చేయకూడదని కోరుతున్నాను. సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు' తెలిపారు.

హీరోయిన్ తన్వి నేగి (Tanvi Negi) మాట్లాడుతూ.. సినిమాకి ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ చాలా ఆనందాన్ని ఇస్తోందని, ప్రేక్షకులు నా పాత్రని చాలా ఇష్టపడుతున్నార‌న్నారు. ఫుల్ క్రౌడ్ ఉన్న థియేటర్స్ లో సినిమా చూడటం చాలా థ్రిల్ ఇచ్చిందన్నారు. చాలా కొత్త అనుభూతిని ఇచ్చే సినిమా ఇది అని. తప్పకుండా అందరూ వెళ్లి సినిమా చూడాల‌ని.. తప్పకుండా ఎంజాయ్ చేస్తారుస అని తెలిపింది. సహా నిర్మాత ప్రదీప్ పూడి మాట్లాడుతూ.. నిన్నటి కంటే ఈ రోజు బెటర్ ఫుట్ పాల్ ఉందని.. వైజాగ్, రాజమండ్రిల‌లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందన్నారు. చాలా చోట్ల హౌస్ ఫుల్స్ అయ్యాయని, సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు. ఇంకా చూడని ప్రేక్షకులు తప్పకుండా వెళ్లి సినిమా డాల‌ని.. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తార‌న్నారు. మంచి సినిమా చేశారనే ప్రసంశలు వస్లున్నాయ‌ని, మంచి సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది'' అన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 07:24 PM