Maname: పిల్లాడి రాకతో గందరగోళం.. శర్వానంద్, కృతి శెట్టి 'మనమే' టీజర్ విడుదల

ABN , Publish Date - Apr 19 , 2024 | 06:15 PM

కొంత గ్యాప్ త‌ర్వాత హీరో శర్వానంద్ న‌టిస్తోన్న‌ చిత్రం మనమే. తాజాగా ఈ చిత్రం టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు.

Maname: పిల్లాడి రాకతో గందరగోళం.. శర్వానంద్, కృతి శెట్టి 'మనమే' టీజర్ విడుదల
maname

కొంత గ్యాప్ త‌ర్వాత హీరో శర్వానంద్ (Sharwanandh) న‌టిస్తోన్న‌ చిత్రం మనమే (Maname). 35వ సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య (Sriram adittya) దర్శకత్వం వ‌హిస్తుండ‌గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్, ప్రతి ప్రమోషనల్ మెటిరియల్ కి అద్భుతమైన స్పందన రాగా తాజాగా ఈ రోజు, మేకర్స్ ఈ చిత్రం టీజర్‌ను విడ‌ద‌ల చేశారు.

sharwa.jpeg

పరస్పరం భిన్నమైన మనస్తత్వం ఉన్న ఇద్దరు వ్యక్తులు, వారి జర్నీలోకి ఊహించని విధంగా ఓ బాల అతిథి రాక‌తో జ‌రిగే క‌థ చుట్లూ సినిమా ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.. శర్వానంద్ (Sharwanandh) హీరో పాత్రలో అమాయకంగా ఉండే ప్లే బాయ్‌గా పాత్ర‌లో, బాధ్యతాయుత అమ్మాయిగా కృతి శెట్టి (Kriti Shetty) కనిపించింది. పిల్లాడి పాత్రలో విక్రమ్ ఆదిత్య ఎంట్రీతో వారి జీవితాలు ఎందుకు తలకిందుల‌య్యాయి.. పిల్లాడి రాక వారి జీవితంలో ఎలాంటి గందరగోళానికి గురి చేసింది అనే ఇతివృత్తంలో సినిమా ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.


maname.jpgదర్శకుడు శ్రీరామ్ ఆదిత్య (Sriram adittya) న్యూ ఏజ్ కథతో వచ్చి హ్యూమరస్‌గా పాత్ర‌ల‌ను ప్రజెంట్ చేశారు. మూడు పాత్రల మధ్య రిలేషన్ ని బయటపెట్టకుండా టీజర్‌ను స్మార్ట్ గా కట్ చేసి ప్రేక్ష‌కుల్లో సినిమాపై ఆస‌క్తి పెరిగేలా చేశారు.ఈ వేస‌విలోనే చిత్రం విడుదల కానుంది. విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ VS కెమెరా పనితనం, హేషమ్ అబ్దుల్ వహాబ్ తన అద్భుతమైన స్కోర్‌తో ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ డిజైన్ టాప్-క్లాస్‌గా ఉంది, అన్నింటిలో రిచ్‌నెస్ ఉంది.

Updated Date - Apr 19 , 2024 | 06:15 PM