Sharwanand: ఘాజీ ద‌ర్శ‌కుడితో.. శ‌ర్వానంద్ పాన్ ఇండియా సినిమా?

ABN , Publish Date - Apr 10 , 2024 | 01:51 PM

రెండేండ్లుగా సైలెంట్ గా ఉన్న యువ హీరో శర్వానంద్ సినిమాల వేగం పెంచారు. ఏకంగా నాలుగైదుచిత్రాలు లైన్‌లో పెట్టాడు. తాజాగా అదే కోవ‌లో మ‌రో కొత్త చిత్రాన్నికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

Sharwanand: ఘాజీ ద‌ర్శ‌కుడితో.. శ‌ర్వానంద్ పాన్ ఇండియా సినిమా?
sharwanand

రెండేండ్లుగా సైలెంట్ గా ఉన్న యువ హీరో శర్వానంద్ (Sharwanand) సినిమాల వేగం పెంచారు. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా నాలుగైదుచిత్రాలు లైన్‌లో పెట్టి ఆ చిత్రాల షూటింగ్‌లో తీరిక లేకుండా ఉన్నాడు. చివ‌ర‌గా 2022లో ఒకే ఒక జీవితం సినిమాలో క‌నిపించిన ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కు మ‌రే సినిమాలోనూ క‌నిపించ‌లేదు. ఈ చిత్రం త‌ర్వాత పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన శ‌ర్వా తాజాగా తండ్రిగా ప్ర‌మోష‌న్ కూడా పొందిన సంగ‌తి తెలిసిందే.

sharwanand.jpg

ఇప్ప‌టికే మ‌నమే (Maname) అనే చిత్రం షూటింగ్ లో శర్వా బిజీగా ఉండగా.. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన పాట మంచి వ్యూస్ దక్కించుకుంది. తాజాగా త‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా #Sharwa36, #Sharwa37 మ‌రో రెండు చిత్రాల‌ను ప్ర‌క‌టించారు. ఇప్పుడు అదే కోవ‌లో మ‌రో కొత్త చిత్రాన్నికి గ్రాన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.


ghaji.jpg

గ‌తంలో రానాతో ఘాజీ (The Ghazi Attack ), వ‌రుణ్ తేజ్‌తో అంత‌రిక్షం (Antariksham 9000 KMPH), విద్యుత్ జ‌మ్వాల్ (Vidyut Jammwal)తో ఐబీ 71 (IB71) అనే బాలీవుడ్ చిత్రం రూపొందించిన యువ‌ ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి (Sankalp Reddy) తాజాగా చాలా గ్యాప్ త‌ర్వాత మ‌రో సినిమా రూపొందించ‌డానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.

Ghazi-director-Sankalp-Reddy-next-with-Bollywood-hero.jpg

సంక‌ల్ప్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో శ‌ర్వానంద్ ఓకే చెప్పాడ‌ని #Sharwa38 గా రానున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో తెర‌కెక‌క్నున్న‌ట్లు, ఈ యేడాది చివ‌ర‌లో సెట్స్ పైకి రానున‌న్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Updated Date - Apr 10 , 2024 | 01:59 PM