Shanmukh Jaswanth: అన్న కోసం వెళ్తే.. తమ్ముడు దొరికిపోయాడు!

ABN , Publish Date - Feb 22 , 2024 | 11:59 AM

యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ ఫేం షణ్ముఖ్‌ (Shanmukh Jaswanth)గంజాయితో పట్టుపడ్డాడు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ని అదుపులోకి తీసుకునేందుకు తన ప్లాట్ కి వెళ్లిన పోలీసులకు.. అక్కడ షణ్ముఖ్‌ జస్వంత్ గంజాయి తీసుకొంటూ కనిపించాడు.

Shanmukh Jaswanth: అన్న కోసం వెళ్తే.. తమ్ముడు దొరికిపోయాడు!

యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ ఫేం షణ్ముఖ్‌ (Shanmukh Jaswanth)గంజాయితో పట్టుపడ్డాడు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ని అదుపులోకి తీసుకునేందుకు తన ప్లాట్ కి  వెళ్లిన పోలీసులకు.. అక్కడ షణ్ముఖ్‌ జస్వంత్  గంజాయి తీసుకొంటూ కనిపించాడు. దీంతో సంపత్‌ వినయ్‌తోపాటు షణ్ముఖ్‌ను నార్సింగ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులతోపాటు యువతి మౌనిక కూడా అక్కడికి వెళ్లింది. ఇంట్లోకి వెళ్లి చూడగా.. షణ్ముఖ్‌ ఒక్కడే కనిపించాడు. అతని వద్ద 16 గ్రాముల గంజాయి లభించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.


షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ యువతితో పదేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. ఇద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. కొద్ది రోజుల్లో పెళ్లి కూడా నిశ్చయమైంది. ఆ తర్వాత ఆమెను దూరం ౅పెట్టాడు. 20 రోజుల క్రితం వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న ప్రియురాలు పోలీసులను ఆశ్రయించింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది.

Shanluk.jpg

షార్ట్‌ ఫిల్మ్స్‌తో కెరీర్‌ ప్రారంభించిన షణ్ముఖ్‌ 'సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌’ వెబ్‌ సిరీస్‌తో పాపులర్‌ అయ్యాడు. ప్రస్తుతం ఫేమస్‌ యూట్యూబర్‌గా పేరుపొందాదు. సినిమా దర్శకుడు కావాలనేది అతని కోరిక. గతంలో కూడా జూబ్లీహిల్స్‌లో కార్‌ యాక్సిడెంట్‌ చేసిన వార్తల్లో నిలిచాడు షణ్ముఖ్‌. 

Updated Date - Feb 22 , 2024 | 02:05 PM