RC16: అధికారిక ప్రకటనే ఆలస్యం..!

ABN , Publish Date - Mar 21 , 2024 | 06:33 PM

రామ్‌చరణ్‌ హీరోగా 'ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'ఆర్‌సీ 16' పూజా కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ విలన్ గా కనిపించే  అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

RC16: అధికారిక ప్రకటనే ఆలస్యం..!


రామ్‌చరణ్‌ (Ram charan) హీరోగా 'ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'ఆర్‌సీ 16' (Rc16) పూజా కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ విలన్ గా కనిపించే  అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే చిత్రబృందం ఆయన్ని సంప్రదించినట్లు సమాచారం. కథ, తన పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండటంతో ఆయన ఓకే అన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే 2013లో రామ్‌ చరణ్‌ నటించిన బాలీవుడ్‌ చిత్రం 'జంజీర్‌’లో సంజయ్‌ దత్ నటించిన సంగతి తెలిసిందే. మరోసారి వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్‌ చేసుకుంటే బావుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది. స్పోర్ట్స్‌ డ్రామాగా... గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్‌కు జోడీగా జాన్వీకపూర్‌ కనిపించనున్నారు. శివరాజ్‌కుమార్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. తన కెరీర్‌లో మాంచి మట్టి చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందనీ, తన గత చిత్రాల్లో ప్రత్యేకంగా నిలుస్తుందని రామ్‌చరణ్‌ ఇప్పటికే చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్థి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్వరలోనే రెగ్యులర్‌ షూట్‌ మొదలుకానుంది. ఇప్పటికే ‘కేజీయఫ్‌ 2’, ‘లియో’లో సంజయ్‌ దత విలన్‌గా కనిపించారు. ఆయా చిత్రాలతో ఆయన తెలుగువారి కి చేరువయ్యారు. ప్రస్తుతం రామ్‌ నటిస్తోన్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Updated Date - Mar 21 , 2024 | 06:34 PM