Sandhya Theatre Stampede: రేవతి కుటుంబానికి మైత్రీ మేకర్స్ భారీ సహాయం
ABN , Publish Date - Dec 23 , 2024 | 05:24 PM
'పుష్ప 2' నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బాధిత కుటుంబానికి భారీ సహాయం అందజేసింది.
దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన రాజకీయ రంగు పులుముకుంటుంది. రోజుకో కొత్త ఎపిసోడ్ తో ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించగా సినీ సెలబ్రిటీలు శ్రీతేజ్ ని పరామర్శించడానికి క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే 'పుష్ప 2' నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బాధిత కుటుంబానికి భారీ సహాయం అందజేసింది.
ఇప్పటికే శ్రీతేజ్ కుటుంబానికి అల్లు అర్జున్ 25 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించగా. డైరెక్టర్ సుకుమార్, భార్య తబిత రూ. 5 లక్షల సహాయాన్ని అందజేశారు. నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసులు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించారు. నటులు జగపతి బాబు, ఆర్. నారాయణమూర్తి కుటుంబానికి దైర్యం చెప్పి భరోసానిచ్చారు. తాజాగా 'పుష్ప 2' నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, నవీన్ లు రూ. 50 లక్షల భారీ నష్ట పరిహారాన్ని ప్రకటించారు. ఆ చెక్కును రేవతి భార్య భాస్కర్ కి అందజేశారు.
ఇక బాలుడి ఆరోగ్య పరిస్థితి విషయానికొస్తే.. పరిస్థితి విషయంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. డాక్టర్ల నివేదిక ప్రకారం.. శ్రీతేజ్ ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్నాడని, ఫీవర్ పెరుగుతుందని చెప్పారు. బాలుడి మెదడుకు ఆక్సిజన్ సరిగా అందట్లేదని, ఇంకా అపస్మారక స్థితిలోనే బాలుడు ఉన్నాడని ప్రకటించారు. ట్యూబ్ ద్వారా ఆహారం పంపిస్తున్నామని తెలిపిన వైద్యులు.. పరిస్థితి క్రిటికల్‌గానే ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ రోజు వచ్చిన బులిటెన్‌లో బాలుడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లుగా డాక్టర్స్ వెల్లడించారు.