Sandhya Theatre stampede: అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటీషన్‌పై విచారణ

ABN , Publish Date - Dec 30 , 2024 | 10:43 AM

పుష్ప-2,  సంధ్య థియేటర్‌ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్‌ (Allu Arjun) హైకోర్ట్‌ మధ్యంతర బెయిల్‌పై ఉన్న సంగతి తెలిసిందే. రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం నాంపల్లి కోర్టు విచారణ జరపనుంది.

పుష్ప-2 (Pushpa 2),  సంధ్య థియేటర్‌ (Sandhya Theater Stampede) ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్‌ (Allu Arjun) హైకోర్ట్‌ మధ్యంతర బెయిల్‌పై ఉన్న సంగతి తెలిసిందే. రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం నాంపల్లి కోర్టు విచారణ జరపనుంది. బెయిల్‌ పిటిషన్‌పై  పోలీసులు కౌంటర్‌ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 27న జరిగిన విచారణలో కౌంటర్‌కి సమయం కోరారు పోలీసులు.  గతంలో విధించిన 14 రోజుల రిమాండ్‌ ముగియడంతో ఆ రోజు వర్చువల్‌గా కోర్టుకు హాజరయ్యారు అల్లు అర్జున్‌. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్‌ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. తొక్కిసలాట ఘటనపై నాంపల్లి కోర్టు జనవరి 10న విచారణ జరపనుంది. అల్ల్లు అర్జున్‌ రిమాండ్‌పైనా అదే రోజు విచారణ జరగనుంది.

అసలు విషయంలోకి వెళ్తే..

డిసెంబర్‌ 4 రాత్రి పుష్ప-2 ప్రీమియర్‌ షో సందర్భంగా అల్లు అర్జున్‌ అభిమానులతో సినిమా చూడటానికి ఆర్‌టీసీ క్రాస్‌ రోడ్స్‌ సంధ్యా థియేటర్‌కు వెళ్లారు. ఆయన వస్తున్నారని తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా పోటెత్తారు. దాంతో తొక్కిసలాట జరిగింది. అక్కడ రేవతి అనే మహిళ మరణించారు. దాంతో అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్‌ విధించగా ఆయన తరఫు న్యాయవాధి హైకోర్టును ఆశ్రయించారు, క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. వాదనల అనంతరం హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అదే రోజు బెయిల్‌ వచ్చినా మర్నాడు ఉదయం చంచల్‌గూడ నుంచి అల్లు అర్జున్‌ విడుదలయ్యారు.

 

Updated Date - Dec 30 , 2024 | 10:58 AM