scorecardresearch

Sandhya Theatre Stampede: పాతిక లక్షల సహాయం అబద్దం.. న్యాయం చేయలేదు

ABN , Publish Date - Dec 19 , 2024 | 12:36 PM

సంధ్య థియేటర్ ఘటనలో రోజుకో ఆసక్తికర విషయం బయటపడుతుంది. అల్లు ఫ్యామిలీ అసలు నిజంగానే బాధితులకి సహాయం చేస్తుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Sandhya Theatre Stampede: పాతిక లక్షల సహాయం అబద్దం.. న్యాయం చేయలేదు

'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షో నేపథ్యంలో డిసెంబర్ 4న హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళా మృతి చెందగా 9 ఏళ్ల శ్రీతేజ్ ఆరోగ్యం క్రిటికల్ గా ఉంది. అయితే బాదితులకు ఇప్పటికే నటుడు అల్లు అర్జున్ రూ. 25 లక్షల ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. కానీ అందులో వాస్తవం లేదని కాంగ్రెస్ రెబల్ లీడర్ బక్క జడ్సన్ అన్నారు.


తాజాగా బక్క జడ్సన్ మీడియాతో మాట్లాడుతూ.. రూ. 25 లక్షల ఆర్థిక సహాయం అబద్దమని అన్నారు. కేవలం రూ.10 లక్షల సహాయం మాత్రమే బాధితులకి అందిందన్నారు. ఇక శ్రీతేజ్ వైద్య ఖర్చులు కూడా తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. దీంతో అన్ని విధాల ఆదుకుంటామని చెప్పిన అల్లు ఫ్యామిలీ ఏం చేసింది అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


అంతకు ముందు బన్నీ రెస్పాండ్ అవుతూ.. "శ్రీతేజ్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం అతడిని కలవలేక పోతున్నా. వాళ్ల ఇంటికి వెళ్లలేకపోతున్న. త్వరలోనే వారి కుటుంబాన్ని కలిసి మాట్లాడతా. వారిని ఆదుకుంటానని ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నా. బాధిత కుటుంబానికి రూ. 25లక్షలు సాయం అందిస్తా. చికిత్స ఖర్చు భరిస్తా, ఆ కుటుంబానికి అండగా ఉంటా" అని ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated Date - Dec 19 , 2024 | 12:36 PM