Sandeep Reddy Vanga: ‘పొట్టెల్’.. ఇలాంటి సినిమాలు మ‌ల‌యాళంలో ఎక్కువ‌గా వ‌స్తాయ్‌

ABN , Publish Date - Apr 18 , 2024 | 10:14 PM

యువ చంద్ర కృష్ణ , అనన్య నాగళ్ల జంట‌గా నటించిన చిత్రం పొట్టెల్ . సాహిత్ మోత్ఖూరి దర్శకత్వం వ‌హించారు. తాజాగా ఈరోజు (గురువారం) చిత్రం టీజర్‌ని విడుదల చేశారు.

Sandeep Reddy Vanga: ‘పొట్టెల్’.. ఇలాంటి సినిమాలు మ‌ల‌యాళంలో ఎక్కువ‌గా వ‌స్తాయ్‌
pottel

యువ చంద్ర కృష్ణ (Yuva Chandraa), అనన్య నాగళ్ల (Ananya Nagalla) జంట‌గా నటించిన చిత్రం పొట్టెల్ (Pottel). సాహిత్ మోత్ఖూరి (Sahit mothkhuri)దర్శకత్వం వ‌హించారు. NISA ఎంటర్టైన్మెంట్స్ (NISA ENTERTAINMENTS) ప‌తాకంపై నిశాంక్ రెడ్డి కుడితి మరియు ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్పై సురేష్ కుమార్ సడిగే నిర్మించారు. ఈక్ర‌మంలో విడుద‌ల చేసిన టీజ‌ర్లు, పోస్ట‌ర్లు, పాట‌లు సినిమాపై మంచి బ‌జ్‌ను తీసుకువ‌చ్చాయి. తాజాగా మేకర్స్ ఈరోజు (గురువారం) చిత్రం టీజర్‌ని విడుదల చేయ‌గా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (SandeepReddyVanga) ముఖ్య అతిథిగా హ‌జ‌ర‌య్యారు. ఈరోజు విడుద‌ల చేసిన టీజర్‌ను గ‌మ‌నిస్తే.. కుల వివక్ష ఉన్న మారుమూల తెలంగాణ గ్రామంలో తన కుమార్తెకు మంచి చ‌దువు, జీవితాన్ని అందించాలని కోరుకునే బాధ్యతగల భర్త మరియు తండ్రిగా హీరో యువ చంద్రకృష్ణ కనిపించాడు. అంతేగాక ఆ ఊరికి పవిత్రమైన గొర్రె తప్పిపోవ‌డంతో గ్రామస్థులు అతనిపై దాడి చేయడం వ‌టంఇ ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి.

959f029a-dad2-4c15-a8fc-f764d3f30ffd.jpeg

యువ చంద్ర కృష్ణ అమాయకంగా, పాత్రకు తగినట్లుగా కనిపించగా.. అతని భార్యగా అనన్య నాగళ్ల ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించింది. సీనియ‌ర్ న‌టుగు అజయ్ పటేల్‌గా నెగిటివ్ షేడ్స్‌ ఉన్న పాత్రను పోషించాడు, చివరిలో అతని పోతురాజు గెటప్ ప్రధాన హైలైట్ లలో ఒకటి గా నిలిచింది. ప్రతి పాత్రను చక్కగా తీర్చిదిద్దినట్టు ఈ టీజర్‌లో కనిపిస్తుంది.మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ సినిమా గ్రాఫ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్ల‌గా.. శేఖర్ చంద్ర స్కోర్ కథనానికి ఇంటెన్సిటీని సమకూర్చింది. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్, నార్ని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని చూడాలనే ఆసక్తిని టీజర్ మరింత పెంచింది.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (SandeepReddyVanga) మాట్లాడుతూ.. సాహిత్ తో నాలుగేళ్ళుగా పరిచయం ఉంది. ఈ సినిమా కథ ఫోన్ లో చెప్పాడు. మొదటి రోజు నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. పొట్టెల్ టీజర్ చూస్తున్నపుడు.. ఇలాంటి కంటెంట్ మలయాళం సినిమాలో ఎక్కువగా చూస్తుంటాం. తెలుగులో ఇలాంటి సినిమాలు రావట్లేదని అనుకుంటాం కానీ ఈ సినిమా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా అన్నారు. యువ చంద్ర కృష్ణ, అజయ్, జీవన్, నోయల్, ప్రియాంక, అనన్య అందరికీ ఆల్ ది బెస్ట్. సాహిత్ రెండో సినిమా ఇది. తన మొదటి సినిమా బంధం రేగడ్ నాకు చాలా ఇష్టం. .పొట్టెల్ టీజర్ చూసినప్పుడు తన ఆనుకున్న కథ తెరపైకి అద్భుతంగా తీసుకొచ్చారని అనిపించింది. అజయ్ గారి లుక్ టెర్రిఫిక్ గా వుంది. టీజర్ అందరినీ టీజ్ చేసిందని భావిస్తున్నాను. ఈ సినిమాని మొదటి రోజు చూడాలని ఎదురుచూస్తున్నాను. ఇది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్' తెలిపారు.

GLchYBoWEAAPfxR.jpeg


హీరో యువ చంద్ర కృష్ణ మాట్లాడుతూ.. మా సినిమా ఈవెంట్ కి సందీప్ అన్న రావడం చాలా ఆనందాన్ని, బలాన్ని ఇచ్చింది. పొట్టెల్ మన మట్టికథ. మనకి దగ్గరగా ఉండే సినిమా ఇది. స్క్రీన్ ప్లే లోని మ్యాజిక్ ప్రేక్షకులని అబ్బుర పరుస్తుంది. మంచి ఎమోషన్ తో కూడుకున్న పక్కా కమర్షియల్ తెలుగు సినిమా ఇది. ఇందులో గంగా పాత్ర చేశాను. ఆ పాత్ర మనలో ఒకడిగా ఉంటుంది. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా మరింతగా హత్తుకుంటుంది. గొప్ప స్ఫూర్తిని ఇచ్చే సినిమా ఇది. శేఖర్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అజయ్ అన్నని మరో లుక్ లో చూస్తారు. సాహిత్ వన్ మ్యాన్ షో ఇది చాలా హార్డ్ వర్క్ చేశారు. నిర్మాతలు చాలా ప్రేమించి ఈ సినిమా చేశారు. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు. అజయ్ మాట్లాడుతూ.. సాహిత్ చాలా అద్భుతమైన కథ చెప్పాడు. దాని కంటే అద్భుతంగా తీశాడు. టీంలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మంచి ఎమోషన్స్ తో వున్న కమర్షియల్ సినిమా ఇది. సాహిత్ పెద్ద దర్శకుడు అవుతాడు. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రల్లో ఇది ది బెస్ట్ రోల్, సందీప్ గారు రావడం వలన టీజర్ రీచ్ మరో స్థాయికి వెళ్ళింది'' అన్నారు.

9ff02113-72fb-4593-b631-f7e8a0a59b90.jpeg

అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. మీ అందరి స్పంద‌న చూస్తుంటే టీజర్ పెద్ద హిట్ అని అర్ధమౌతోంది. సందీప్ రెడ్డి వంగా గారు మా టీం అందరికీ పెద్ద ఎనర్జీ ఇచ్చారు. దర్శకుడు సాహిత్ చెప్పిన దాని కంటే వందరెట్లు అద్భుతంగా ఉంది టీజర్. ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. మా కెరీర్ లో ఇది ది బెస్ట్ సినిమా అవుతుంది.' అన్నారు. దర్శకుడు సాహిత్ మోత్ఖురి మాట్లాడుతూ.. సందీప్ అన్న టీజర్ లాంచ్ చేయడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాకి మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న ప్రణయ్, సందీప్ అన్నకి థాంక్స్. పొట్టెల్ ఎమోషనల్ రైడ్ కి తీసుకెళుతుంది. టీజర్ స్నీక్ పీక్ మాత్రమే. ఈ సినిమా విషయంలో మేమంతా చాలా గర్వంగా ఫీలౌతున్నాం. నిర్మాతలు చాలా గొప్పగా సపోర్ట్ చేశారు ఈ సినిమాలో నటించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు' తెలిపారు.

GLcmvHTWsAAUVVE.jpeg

నిర్మాత నిశాంక్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు సందీప్ అన్న రావడం వెయ్యి ఏనుగుల బలం ఇచ్చింది. టీజర్ లాంచ్ చేసిన సందీప్ అన్నకి థాంక్స్. సురేష్ అన్నతో కలిసి ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నుంచి చాలా విలువైన విషయాలు నేర్చుకున్నాను. సాహిత్ నన్ను నిర్మాతని చేశాడు. చాలా గొప్ప సినిమా తీశాడు. మీ అందరికీ గుర్తిండిపోతుంది. అజయ్ అన్న అద్భుతంగా నటించారు. యువ చాలా మంచి హీరో అవుతాడు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది మట్టి నుంచి పుట్టిన కథ. ఈ సినిమాకి మీ అందరి ఆదరణ వుంటుందని ఆశిస్తున్నాను. నిర్మాత సురేష్ కుమార్ మాట్లాడుతూ.. టీజర్ లాంచ్ చేసిన సందీప్ అన్నకి థాంక్స్. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. పొట్టెల్ సినిమా వెనుక సాహిత్ కృషి వుంది. తను లేకపోతే సినిమా లేదు. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్ అందరూ అద్భుతంగా నటించారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. శేఖర్ చంద్ర నేపధ్య సంగీతం అదరగొట్టారు. తప్పకుండా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది''అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Updated Date - Apr 18 , 2024 | 10:14 PM