Samantha: ఫాంటసీ వరల్డ్‌లోకి సామ్.. అరుదైన గౌరవం

ABN , Publish Date - Dec 08 , 2024 | 10:00 AM

సమంత రుతు ప్రభుకి అరుదైన గౌరవం దక్కింది. ఆమె ఫాంటసీ వరల్డ్‌లోకి అడుగుపెట్టారు.

సమంత రుతు ప్రభు.. క్వీన్ ఆఫ్ టాలీవుడ్. ఇప్పుడు బాలీవుడ్, హాలీవుడ్ సిరీస్‌లతో హంగామా చేస్తోంది. తాజాగా ఆమె ఫాంటసీ వరల్డ్‌లోకి అడుగుపెట్టి మరోసారి యాక్షన్ మోడ్‌లోకి వచ్చేశా అని తెలిపింది. ఇక ఇటీవల రిలీజైన సిటాడెల్: హనీ బన్నీ కూడా అరుదైన గౌరవం పొందింది. ఇంతకీ ఆ ఫాంటసీ వరల్డ్ ఏంటి? అరుదైన గౌరవం ఏంటంటే..


ప్రస్తుతం సీనియర్ టాప్ హీరోయిన్లందరూ విమెన్ ఓరియెంటెడ్ కథలతో పాటు ఓటీటీ సిరీస్ ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులో అందరికంటే సమంత ఒక అడుగు ముందుంది. ది ఫ్యామిలీ మేన్, సిటాడెల్: హనీ బన్నీ సిరీస్ లలో యాక్షన్ మోడ్ లో కనిపించిన ఆమె మరోసారి యాక్షన్ సిరీస్ తో ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. 'తుంబాడ్' ఫేమ్ రాహి అనిల్ బార్వే దర్శకత్వంలో రక్తా బ్రహ్మాండ్'. ది బ్లడీ కింగ్డమ్ పేరుతో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెట్ ఫ్లిక్స్ సిరీస్ లో ఆదిత్య రాయ్ కపూర్, సమంత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ స్టోరీ GA కులకర్ణి షార్ట్ స్టోరీ విదుషాక్ నుండి ప్రేరణ పొందింది, ఈ కథలో చక్రవర్తి మరణం తర్వాత ఖాళీగా ఉన్న సింహాసనం కోసం పోటీపడుతున్న ఇద్దరు యువరాజులను అనుసరిస్తుంది. తాజాగా ఈ ఫాంటసీ వరల్డ్ షూటింగ్ లోకి అడుగుపెట్టినట్లు సమంత ప్రకటించింది.


సమంత, వరుణ్‌ ధావన్‌ నటించిన ‘హనీ బన్నీ’ వెబ్‌ సిరీస్‌ ఇటీవలే అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. రస్సో బ్రదర్స్‌ దర్శకులుగా రూపొందిన ‘సిటాడెల్‌’కు ఇది ఇండియన్‌ వెర్షన్‌. రాజ్‌ అండ్‌ డీకే దర్శక ద్వయం తెరకెక్కించిన ఈ వెబ్‌ సిరీస్‌కు ఓ అరుదైన గౌరవం దక్కింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే క్రిటిక్స్‌ చాయిస్‌ అవార్డ్‌ ్స 30వ ఎడిషన్‌లో.. ఉత్తమ విదేశీ భాషా సిరీస్‌లలో ఒకటిగా ‘హనీ బన్నీ’ నామినేట్‌ అయ్యింది. వచ్చే ఏడాది జనవరి 12న ఈ అవార్డుల వేడుక యూఎస్‌లోని శాంట మోనికాలో జరగనుంది.

Updated Date - Dec 08 , 2024 | 10:02 AM