Samantha: నువ్వు లిటిల్‌ ఛాంపియన్.. అభిమానిపై ప్రశంసలు!

ABN , Publish Date - May 21 , 2024 | 04:05 PM

తనకు వీరాభిమాని అయిన అమృషపై ప్రశంసల వర్షం కురిపించారు సమంత (Samantha) ఇటీవల రిలీజైన తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో సమంత అభిమాని మంచి ర్యాంకు సాధించింది.

Samantha: నువ్వు లిటిల్‌ ఛాంపియన్.. అభిమానిపై ప్రశంసలు!

తనకు వీరాభిమాని అయిన అమృషపై ప్రశంసల వర్షం కురిపించారు సమంత (Samantha) ఇటీవల రిలీజైన తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో సమంత అభిమాని మంచి ర్యాంకు సాధించింది. తన డైహార్డ్‌ ఫ్యాన్‌ అయిన అమ్మాయి 9Samanth wishes to Fan) ఎంసెట్‌ ర్యాంక్‌ సాధించడంతో సమంత ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఆమెతో దిగిన ఫోటోను పంచుకుంది. "నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది లిటిల్‌ ఛాంపియన’ అని సమంత పోస్ట్‌ చేసింది. తన అభిమాని అయిన ఆ స్టూడెంట్‌ ప్రతిభను ప్రశంసించడం చూసిన ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Sam.jpg

ప్రస్తుతం సమంత రెస్ట్‌లో ఉన్నారు. సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చి.. మయోసైటిస్‌ చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకున్నారు. యోగ, వర్కవుట్స్‌ అంటూ బిజీగా గడుపుతున్నారు. గతేడాది ఖుషీ, శాకుంతలం సినిమాలతో అలరించిన ఈ భామ. సినిమాలకు కాస్తా బ్రేక్‌ ఇచ్చింది. అయితే సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఆమె నటించిన సిటాడెల్‌ సిరీస్‌ విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగులో తన సొంత ట్రాలాలా బ్యానర్‌పై 'మా ఇంటి బంగారం’ చిత్రాన్ని ప్రకటించింది. 

Updated Date - May 21 , 2024 | 04:14 PM