Samantha Take 20: ఇలాంటివి నా దగ్గరకు రావు అనుకున్నా.. కానీ!

ABN , Publish Date - Feb 20 , 2024 | 10:34 AM

టాలీవుడ్‌ అగ్ర కథానాయికల్లో ఒకరైన సమంత మయోసైటిస్‌ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చికిత్స తీసుకుని కోలుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ అనుభవాలను అందరితో పంచుకోవడంతోపాటు, ఆ వ్యాధి సంబంధిత విషయాలపై అవగాహన కల్పించేందుకు ‘టేక్‌ 20’ పేరుతో హెల్త్‌ పాడ్‌కాస్ట్‌ ప్రారంభించారు.

Samantha Take 20: ఇలాంటివి నా దగ్గరకు రావు అనుకున్నా.. కానీ!

టాలీవుడ్‌ అగ్ర కథానాయికల్లో ఒకరైన సమంత(Samantha) మయోసైటిస్‌ (Myositis) వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చికిత్స తీసుకుని కోలుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ అనుభవాలను అందరితో పంచుకోవడంతోపాటు, ఆ వ్యాధి సంబంధిత విషయాలపై అవగాహన కల్పించేందుకు ‘టేక్‌ 20’ పేరుతో హెల్త్‌ పాడ్‌కాస్ట్‌ ప్రారంభించారు. దానికి సంబందానికి సంబంధించిన తొలి ఎపిసోడ్‌ను సోమవారం విడుదల చేశారు. సమంత అడిగిన పలు ప్రశ్నలకు న్యూట్రీషనిస్ట్‌ అల్కేశ్‌ జవాబులిచ్చారు. ఎంతో రీసెర్చ్‌ చేసి, అనుభవజ్ఞులైనవారి సలహా, సూచనలతో ఈ వెల్‌నెస్‌ కంటెంట్‌ను అందిస్తున్నట్లు సమంత చెప్పుకొచ్చారు.


ఆటో ఇమ్యూనిటీ గురించి?
అల్కేశ్‌:
చాలామంది అనుకుంటున్నట్లు ఇది వ్యాధి కాదు. వైరస్‌, బ్యాక్టీరియాల నుంచి వ్యాధి నిరోధక వ్యవస్థ కాపాడుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అదే వ్యవస్థ తిరిగి మన శరీరంపై దాడి చేస్తే ఆటో ఇమ్యూన్‌ సమస్య అవుతుంది.

Samanth-avere.jpg

ఆటో ఇమ్యూన్‌ కేసులు ఎక్కువవుతున్నాయనే విషయం తెలిసి ఆశ్చర్యపోయా. ముఖ్యంగా షుగర్‌, క్యాన్సర్‌, గుండె సంబంధిత వ్యాధులున్న వారు దీన్ని ఎదుర్కొంటున్నారు? కారణమేంటి?


అల్కేశ్‌:
దీనికి ఆధునిక జీవనశైలిని ప్రధాన కారణం అని చెప్పొచ్చు. తినే ఆహారం, పీచ్చే గాలి, ధరించే దుస్తులు, కాస్మోటిక్స్‌. ఇలా ఏవైనా ప్రభావితం చేయొచ్చు.



నేను మంచి ఆహారం తింటున్నా, ఆరోగ్యంగా ఉన్నా.. ఇలాంటివి నా దగ్గరకు రావు’ అని కొందరు అనుకుంటారు. ఈ జాబితాలో ఉన్నందుకు గిల్టీగా ఫీలయ్యా. నేనూ పొద్దునే లేచి, వర్కౌట్స్‌ చేసేదాన్ని.హెల్దీ ఫుడ్‌ తీసుకునేదాన్ని. నవ్వుతూ ఉండేదాన్ని. నేను మయోసైటిస్‌ బారిన పడటానికి తీవ్ర ఒత్తిడి ఏమైనా కారణమా?

అల్కేశ్‌: అవును. దీనికి తీవ్ర ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు ఆటో ఇమ్యూన్‌కు కారకాలే. ఇలాంటి పరిస్థితుల్లో మంచి నిద్ర ఎంతో అవసరం. ఒక్కోసారి శరీరం నిద్రావస్థలో ఉన్నా మెదడు వృత్తిపర, వ్యక్తిగత జీవితం గురించి ఆలోచిస్తుంటుంది. అది అప్పటికి ఓకే అయినా భవిష్యత్తులో ఎఫెక్ట్‌ పడుతుంది.

ఈ సమస్యను అధిగమించాలంటే ఏం చేయాలి?

అల్కేశ్‌: ఒత్తిడికి దూరంగా ఉండాలి. తాజా ఆహారం తినాలి. ఫిల్టర్‌ చేసిన నీరు తాగాలి. కాస్మోటిక్స్‌ తదితర వాటి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. 

Untitled-9.jpg

Updated Date - Feb 20 , 2024 | 11:12 AM