Samantha: అభిమానులకు తీపి కబురు.. త్వరలో సర్‌ప్రైజ్‌!

ABN , Publish Date - Feb 12 , 2024 | 10:51 AM

మయోసైటిస్‌ అనారోగ్య కారణంతో సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చింది అగ్ర కథానాయిక సమంత. తను అంగీకరించిన చిత్రాలు, సిరీస్‌లు పూర్తి చేసి ప్రస్తుతం రెస్ట్‌లో ఉంది. ఈ గ్యాప్‌లో విదేశాల్లో చికిత్స పొందింది సామ్‌. తాజాగా  సమంత నుంచి అభిమానులకు తీపి కబురు అందింది.

Samantha: అభిమానులకు తీపి కబురు.. త్వరలో సర్‌ప్రైజ్‌!

మయోసైటిస్‌ అనారోగ్య కారణంతో సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చింది అగ్ర కథానాయిక సమంత (Samantha). తను అంగీకరించిన చిత్రాలు, సిరీస్‌లు పూర్తి చేసి ప్రస్తుతం రెస్ట్‌లో ఉంది. ఈ గ్యాప్‌లో విదేశాల్లో చికిత్స పొందింది సామ్‌. తాజాగా  సమంత నుంచి అభిమానులకు తీపి కబురు అందింది. సమంత బ్యాక్‌ టు వర్క్‌ అని సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌ అవుతోంది. త్వరలో మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు అభిమానులకు తీపి కబురు వినిపించింది. గతేడాది ‘శాకుంతలం’, ‘ఖుషి’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన సమంత ‘సిటాడెల్‌’ (Citadel)చిత్రీకరణ తర్వాత సినిమాల నుంచి విరామం తీసుకుంది. తాజాగా సినిమా చిత్రీకరణను మొదలు పెడుతున్నట్లు తెలుపుతూ ఇన్స్టా వేదికగా ఓ వీడియోను పంచుకుంది సమంత.

Sam.jpg

‘ఇప్పటికే చాలా మంది ఎప్పుడు షూటింగ్‌ సెట్‌లో కనిపిస్తారని అడుగుతున్నారు. ఇప్పుడు ఆ టైమ్‌ రానే వచ్చింది.  'నేను త్వరలో మళ్లీ నా పనిని ప్రారంభించబోతున్నాను. కొన్ని రోజులుగా నేను ఒక నిరుద్యోగిగా ఖాళీగా ఉన్నాను. ఇటీవల నేనునా స్నేహితులు కలిసి హెల్త్‌ పాడ్‌కాస్ట్‌పై ఓ కార్యక్రమం చేశాం. త్వరలో దాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు సమంత. అయితే సమంత తదుపరి చిత్రాలు ఏంటనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. తను నటించిన సిటాడెల్‌ సిరీస్‌ విడుదలకు సిద్ధమవుతోంది. రాజ్‌ అండ్‌ డీకే ఈ సిరీస్‌కు దర్శకులు.

Sa,-jam.jpg

Updated Date - Feb 12 , 2024 | 10:51 AM