Samantha: అందులో విఫలమయ్యా... ఇప్పుడు నేను డ్రాగన్

ABN , Publish Date - Mar 24 , 2024 | 12:49 PM

కొంతకాలంగా మయోసైటీస్‌ వ్యాధితో బాధపడుతున్న సమంత (Samantha) ప్రస్తుతం రెస్ట్‌ మోడ్‌లో ఉన్న సంగతి తెలిసిందే!  చికిత్స తీసుకుం టూనే విదేశాలను చుట్టేస్తుంది. తెరపై కనిపించకపోయినా సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో మాత్రం టచ్లో  ఉంటుంది

Samantha:  అందులో విఫలమయ్యా... ఇప్పుడు నేను డ్రాగన్

కొంతకాలంగా మయోసైటీస్‌ వ్యాధితో బాధపడుతున్న సమంత (Samantha) ప్రస్తుతం రెస్ట్‌ మోడ్‌లో ఉన్న సంగతి తెలిసిందే!  చికిత్స తీసుకుం టూనే విదేశాలను చుట్టేస్తుంది. తెరపై కనిపించకపోయినా సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో మాత్రం టచ్లో  ఉంటుంది. నిత్యం తనకు సంబంధించిన విషయాలు తెలియజేస్తుంటుంది. ఈ మధ్య హాట్‌ ఫొటో షూట్‌లతో సోషల్‌ మీడియాను, కుర్రకారును షేక్‌ చేస్తుంది. ఈ భామ మరోసారి ట్రోలర్‌కు పని చెప్పింది.

Sam-3.jpg

బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ సూట్‌లో ఎద అందాలను ఆరబోసి. .కుర్చీలో కూర్చొని ఓరగా చూస్తునట్లు కెమెరాకు ఫోజ్‌ ఇచ్చింది. ఆ ఫొటోలను ఇనస్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అంతే కాదు డిస్నీ యువరాణిగా ఫెయిల్‌ అయ్యా... ఇప్పుడు నేను డ్రాగనని’ అని పోస్ట్‌లో పేర్కొంది. (samantha Dragon). సామ్‌ని అంత హాట్‌గా చూసిన నెటిజన్లు 'సామ్‌.. మళ్లీ మొదలుపెట్టేసావా.. అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక సమంత సినిమాల విషయానికొస్తే 'సిటాడెల్‌' సిరీస్‌ షూటింగ్‌ పూర్తి చేసింది. త్వరలో ఈ సిరీస్‌ విడుదల కానుంది.

Sam-1.jpg

ఇదిలా ఉండగా ఆదివారం ఈమె గురించి మరో వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ప్రస్తుతం ఆమె మెగాస్టార్‌  జతకట్టిందట. ఇప్పటికే ఈ షూట్‌ కంప్లీట్‌ అయిందని తెలుస్తోంది. త్వరలో విడుదలకు సిద్థంగా ఉందని టాక్‌. ఈ వార్త వైరల్‌ అవుతుండడంతో అది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే అది యాడ్‌ కోసమట. ఇంతకీ ఆ స్టార్‌ ఎవరో కాదు మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి. వీరిద్దరూ కలిపి ఓ ఫైనాన్స్  కంపెనీ యాడ్‌ చేశారట. ఈ యాడ్‌ షూట్‌కు సంబందించిన ఫొటోలనే మేకర్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారని తెలుస్తున్నారు. 

Sam.jpg

Updated Date - Mar 24 , 2024 | 12:49 PM