Samantha: సమంత సలహా పాటిస్తే డైరెక్ట్ చావే.. డాక్టర్ ఫైర్

ABN , Publish Date - Jul 05 , 2024 | 02:31 PM

గత రెండేళ్లగా మయోసైటీస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు అగ్ర కథానాయిక సమంత. విదేశాల్లో చికిత్స అనంతరం ఆమె కొంతమేరకు కోలుకున్నారు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించి విషయాలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులకు వెల్లడిస్తూ ఉంటారు

Samantha

గత రెండేళ్లగా మయోసైటీస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు అగ్ర కథానాయిక సమంత. విదేశాల్లో చికిత్స అనంతరం ఆమె కొంతమేరకు కోలుకున్నారు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించి విషయాలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులకు వెల్లడిస్తూ ఉంటారు. తాజాగా సమంత చేసిన ఓ పోస్టు ఇప్పుడు ఆమెను వివాదంలోకి లాగింది. సమంత నెబ్యులైజర్‌ను ఉపయోగిస్తున్న ఫోటోను షేర్‌ చేసింది, వైరల్‌ మందులకు బదులు హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, డిస్టిల్డ్‌ వాటర్‌ కలపడం ‘మేజిక్‌ లాగా పనిచేస్తుందని’ సూచించింది. అయితే దీనిపై కొందరు డాక్టర్లు మండిపడుతున్నారు. సమంతపై విమర్శలు చేస్తున్నారు. సమంత సలహాలు పాటిస్తే డైరెక్ట్‌గా చావేనంటూ ఓ వైద్యుడు ట్విటర్‌లో రాసుకొచ్చారు. దీంతో పాటు సామ్‌ పోస్ట్‌ చేసిన క్లిప్‌ను షేర్‌ చేశారు.

Sam-1.jpg

ఓ డాక్టర్‌ ట్విటర్‌లో ఇలా రాసుకొచ్చారు. ’నటి సమంత వైరల్‌ ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు నీటిలో హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ కలిపి నెబ్యులైజ్‌ (పీల్చడం) చెయ్యండని చెప్తూ తన ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టినట్లు లివర్‌ డాక్టర్‌ ట్వీట్‌ చేశారు. ఇదే నిజమైతే ఇంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదు. హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ అన్  స్టేబుల్‌ రసాయనం, ఇది నీరు, ఆక్సిజన్‌గా మారుతుంది. అయితే ఈ ఆక్సిజన్‌ అణువులుగా మారేముందు పరమాణువులుగా ఉన్నప్పుడు ఫ్రీ రాడికల్స్‌లా పనిచేసి అవి అప్పటికే వైరస్‌ వలన దెబ్బతిన్న ఊపిరితిత్తుల లోపలి పలుచని పొరల్ని బాగా దెబ్బ తీసి, న్యుమోనియా గానీ, ఏక్యూట్‌ రెస్పిటేటరీ డిస్ర్టెస్‌ సిండ్రోమ్‌కు గానీ దారి తీస్తుంది. అది కనుక వస్తే డైరెక్ట్‌గా చావే. ఇక మీ ఇష్టం’ అంటూ ఆ డాక్టర్‌ పోస్ట్‌ చేశారు. ఆ పోస్ట్‌ను గమనించిన నెటిజన్లు సమంతపై మండిపడుతున్నారు. ఇలా హానికరమైన సలహాలు ఎవరైనా  ఇచ్చినప్పుడు వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడే, అందరూ పోస్ట్లు చేసే ముందు జాగ్రత్తగా ఉంటారు అని ఓ  నెటిజన్‌ పోస్టు చేశారు.

Sam-2.jpg
తనపై వస్తున్న విమర్శలకు కామెంట్లకు.. డాక్టర్‌ పెట్టిన పోస్టుకు కూడా సమంత స్పందిందింది. ఆ డాక్టర్‌ కాస్త మర్యాదగా ఉండాలని కోరింది. ఆరోగ్యానికి సంబంధించిన పోస్ట్‌లు పెట్టినప్పుడు నేను చాలా జాగ్రత్తలు వహిస్తాను. ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకుంటాను. మయోసైటీస్‌ విషయంలో నేను తీసుకున్న చికిత్స ఎలా ఉపయోగపడింది. ఎలాంటి మెడిసిన్ ఉపయోగించాను, అవి నాకు సహకరించాయి అన్నది విషయాలను పోస్ట్‌ చేస్తుంటాను. ఒకరికి చెడ్డ చేయాలనే ఉద్దేశం నాకులేదు’’ అని పోస్ట్‌ చేశారు సామ్‌.

Samantha 1.jpegది లివర్‌ డాక్‌ అనే పేరుతో ఉన్న డాక్టర్‌ సిరియాక్‌ అబ్బి ఫిలిప్స్‌ ఈ విషయం మీద ముందుగా స్పందిస్తూ ఈ నెబ్యులైజేషన్‌ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని చెప్పారు. అంతేకాక.. సమంత హెల్త్‌ అండ్‌ సైన్స్‌ నిరక్షరాస్యురాలు’ అని పేర్కొన్నారు.

samanh 2.jpegప్రస్తుతం ఈ టాపిక్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. సమంతకు మంచులక్ష్మీ వరుణ్‌ధావన్‌, నందినీరెడ్డి తదితరులు సపోర్ట్‌గా కామెంట్స్‌ చేశారు. 

Samanth 3.jpeg

Updated Date - Jul 05 , 2024 | 04:10 PM