Samantha: సమంత ఫొటోలు వైరల్‌.. కొటేషన్ తో ఫుల్‌స్టాప్‌!

ABN , Publish Date - May 06 , 2024 | 02:42 PM

సమంత సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో తెలిసిందే! తన గురించి ప్రతి అప్‌డేట్‌ను ఇన్స్స్టాగ్రామ్  వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా ఆమె షేర్‌ చేసిన ఫొటోపై నెట్టింట రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.

Samantha: సమంత ఫొటోలు వైరల్‌.. కొటేషన్ తో ఫుల్‌స్టాప్‌!

సమంత సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో తెలిసిందే! తన గురించి ప్రతి అప్‌డేట్‌ను ఇన్స్స్టాగ్రామ్  వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా ఆమె షేర్‌ చేసిన ఫొటోపై నెట్టింట రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. దానిపై ఆమె అభిమానులు ఫైర్‌ అవుతున్నారు. తాజాగా మయోసైటిస్‌కు చికిత్స తీసుకుంటున్నట్లు చెబుతూ  ఆమె తన  ఇన్స్టా స్టోరీలో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘వైద్యాన్ని కొనసాగిస్తూ కోలుకోవడానికి ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నా’ అనే క్యాప్షన్‌ రాశారు సామ్‌. అయితే ఈ ఫొటోతో పాటు మరో న్యూడ్‌ ఫొటో షేర్‌ చేసిన డిలీట్‌ చేశారని కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. దానికి సంబంధించిన ఒక ఫేక్‌ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. అందులో ఆమె హాఫ్‌ న్యూడ్‌గా ఉండడంతో ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు సమంత అలాంటి ఫొటో షేర్‌ చేయలేదని.. కావాలనే ఫేక్‌ ఫొటో క్రియేట్‌ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని అభిమానులు ఫైర్‌ అవుతున్నారు. ఈ నేపథ్యంలో సమంత ఇన్‌స్టాలో పెట్టిన కొటేషన్‌ కూడా ఆసక్తికరంగా మారింది. 

Sam.jpg

‘‘మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం లేదా నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండా జీవించగలగడమే నిజమైన విజయం’’ అనే కొటేషన్‌ను పంచుకున్నారు. ఆ ప్రచారాన్ని ఆపడానికే సామ్‌  ఈ కొటేషన్ పెట్టినట్టుంది. మయోసైటీస్‌తో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సామ్‌ తాజాగా తన నూతన చిత్రాన్ని ప్రకటించారు. తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌’పై ‘మా ఇంటి బంగారం’ పేరుతో ఓ సినిమా చేయనున్నారు సమంత. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేశారు. దర్శకుడు, ఇతర నటీనటులు ఎవరనేది ఇంకా వెల్లడించలేదు. 

Read More: Tollywood, Cinema News

Updated Date - May 06 , 2024 | 02:43 PM