Salaar actress: సలార్‌ నటికి తీవ్ర గాయాలు! 

ABN , Publish Date - Jan 07 , 2024 | 12:45 PM

సలార్‌’ చిత్రంలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కనిపించిన పూజా విశ్వేశ్వర్‌కు యాక్సిడెంట్‌ అయింది. రోడ్డు ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ముఖమంతా రక్తంతా నిండిపోయింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది,

Salaar actress: సలార్‌ నటికి తీవ్ర గాయాలు! 

'సలార్‌’ చిత్రంలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కనిపించిన పూజా విశ్వేశ్వర్‌కు యాక్సిడెంట్‌ అయింది. రోడ్డు ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ముఖమంతా రక్తంతా నిండిపోయింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది, ఇంతకీ ఈ పూజా విశ్వశ్వర్‌ ఎవరంటే.. ‘సలార్‌’ సినిమాలో ఓ ఫైట్‌ సీన్‌ బాగా హైలైట్‌ అయింది. చిన్నపిల్లలపై ఓ విలన్‌ బలత్కారం చేయబోతే హీరో వచ్చి వారిని రక్షిస్తాడు. ఆ ఈ యాక్షన్‌ సీన బ్యాగ్రౌండ్‌ స్కోర్‌తో బాగా హైలైట్‌ అయింది. ఆ సీనలో విలన్‌ పక్కన కళ్లద్దాలు పెట్టుకుని ఓ మహిళ యాక్ట్‌ చేసింది. ఆమె పేరు పూజా విశ్వేశ్వర్‌. ఆమెది విశాఖపట్నం. ఇటీవల ఆమె వైజాగ్‌లోని అనకాపల్లి హైవేపై వెళ్తుండగా.. బైక్‌ స్కిడ్‌ అయి డివైడర్‌ని  ఢీ కొట్టింది. దీంతో ఈమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అవుతుంది. 


Updated Date - Jan 07 , 2024 | 12:45 PM