Saif Ali Khan: ‘దేవ‌ర’ విల‌న్‌కు గాయాలు.. ఆస్ప‌త్రిలో చేరిక‌

ABN , Publish Date - Jan 22 , 2024 | 09:51 PM

బాలీవుడ్ స్టార్ దేవ‌ర సినిమాలో ప్ర‌తి నాయ‌కుడిగా న‌టిస్తున్న‌ సైఫ్ అలీఖాన్ ద‌వాఖాన‌లో చేరారు. ఆయ‌న మొకాలుకు, భుజానికి గాయాల‌వ‌డంతో చికిత్స కోసం ముంబయ్‌లోని కొకిలాబెన్ ఆస్ప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్న‌ట్లు తెలుస్తోంది.

Saif Ali Khan: ‘దేవ‌ర’ విల‌న్‌కు గాయాలు.. ఆస్ప‌త్రిలో చేరిక‌
devara

బాలీవుడ్ స్టార్ దేవ‌ర (Devara) సినిమాలో ప్ర‌తి నాయ‌కుడిగా న‌టిస్తున్న‌ సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) ద‌వాఖాన‌లో చేరారు. ఆయ‌న మొకాలుకు, భుజానికి గాయాల‌వ‌డంతో చికిత్స కోసం ముంబయ్‌లోని కొకిలాబెన్ ఆస్ప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ వార్తలు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అండంతో ఆయ‌న అభిమానుల‌తో పాటు ఎన్టీఆర్ అభిమానులు ఆందోళ‌న‌ చెందుతున్నారు.


దేవ‌ర (Devara) సినిమాలో యాక్ష‌న్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌లో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) గాయాల‌పాల‌యిన‌ట్లు నెట్టింట వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదు. ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా వ‌స్తుండ‌గా మొద‌టి భాగం ఏప్రిల్ 5న విడుద‌ల కానుంది.

Updated Date - Jan 22 , 2024 | 09:52 PM