మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Laggam: పెళ్లిపుస్తకం స్థాయి చిత్రం ఈ ‘లగ్గం’: డా రాజేంద్రప్రసాద్

ABN, Publish Date - Feb 05 , 2024 | 04:25 PM

సాయి రోనక్, గనవి హీరోయిన్లుగా రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం ల‌గ్గం.ఈ రోజు షూటింగ్ ఆరంభ‌మైంది.

laggam

సుభిశి ఎంటర్త్సైన్మెంట్స్ (Subishi Entertainments) బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం (Laggam) భీమదేవరపల్లి బ్రాంచి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల ఈ సినిమాకు రచన -దర్శకత్వం వహిస్తున్నారు. హీరో హీరోయిన్లుగా సాయి రోనక్ (Sai Ronak), గనవి లక్ష్మణ్ (Ganvi laxman) నటిస్తుండ‌గా రాజేంద్రప్రసాద్ (Rajendra prasad ) కీలకపాత్ర పోషిస్తున్నాడు.

ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా డా. రాజేంద్రప్రసాద్ (Rajendra prasad ) మాట్లాడుతూ.. ‘లగ్గం సినిమాలో ఎవ్వరు, ఎప్పటికీ మరిచిపోలేని పాత్ర పోషిస్తున్నానని,. నా కెరీర్‌లో పెళ్లిపుస్తకం తరువాత అంత గొప్ప పాత్ర ఈ సినిమాలో చేస్తుండడం విశేషమ‌న్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారందరికీ ఈ కథ కథనాలు కనెక్ట్ అవుతాయని’ లగ్గం (Laggam Movie) విందు భోజనం" లాంటి సినిమా అన్నారు.


దర్శకుడు రమేష్ చెప్పాల (Ramesh Cheppala) మాట్లాడుతూ.. ‘పెళ్లి చేసుకోవడం అంటే రెండు కుటుంబాలు కలవడం కాదు.. రెండు మనసులు కలవడం.’ అంటూ గట్టి దావత్ ఇవ్వబోతున్నామ‌న్నారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ (Charan Arjun) సంగీతం, బొంతల నాగేశ్వర రెడ్డి (BONTHALA NAGESWARA REDDY) ఎడిటర్. బేబీ చిత్ర కెమెరామెన్ బాల్ రెడ్డి (Bal Reddy) సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఫిబ్రవరి5 నుంచి పూజా కార్యక్రమాలతో పాటు రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని, ‘ఈ సినిమాతో ప్రేక్షకులకు ఎప్పటికీ మరిచి పోలేని ట్రీట్ ఇవ్వబోతున్నామని,. ఈ సినిమాలో వినోదంతో పాటు ఎమోషన్స్, తెలంగాణ పెళ్లి కల్చర్ ప్రతి ఒక్కరికి వాళ్ళ లగ్గాన్ని గుర్తు చేస్తుందని, పెళ్ళి కాని వారికి ఇలా లగ్గం చేసుకోవాలనిపిస్తుందని హీరో సాయి రొనక్ (Sai Ronak) అన్నారు .

Updated Date - Feb 05 , 2024 | 04:25 PM