Sai Durga tej: మేనమామల ఆశీస్సులతో.. తల్లి పేరున నిర్మాణ సంస్థ

ABN , Publish Date - Mar 09 , 2024 | 01:57 PM

మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ (Sai durga Tej) మరోసారి పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే! తన తల్లి పేరును కలిపి సాయిదుర్గ తేజ్‌గా కొత్త పేరును ప్రకటించారు. అలాగే తన తల్లి విజయ దుర్గ పేరుతో నూతనంగా ప్రారంభించిన ప్రొడక్షన్ హౌస్‌కు లోగోను విడుదల చేశారు. ఈ

 Sai Durga tej: మేనమామల ఆశీస్సులతో.. తల్లి పేరున నిర్మాణ సంస్థ


మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ (Sai durga Tej) మరోసారి పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే! తన తల్లి పేరును కలిపి సాయిదుర్గ తేజ్‌గా కొత్త పేరును ప్రకటించారు. అలాగే తన తల్లి విజయ దుర్గ పేరుతో (Vijay Durga Productions) నూతనంగా ప్రారంభించిన ప్రొడక్షన్ హౌస్‌కు లోగోను విడుదల చేశారు. ఈ మేరకు మేనమామలు చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌ ఆశీస్సులు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు తేజ్‌.

Sai-tej-2.jpg

"నా మాతృమూర్తి విజయదుర్గగారికి చిన్న బహుమతిగా ఆమె పేరుతో కొత్త ప్రొడక్షన్  హౌస్‌ ప్రారంభించాను. మా మావయ్యలు చిరంజీవిగారు, నాగబాబు, అలాగే నా గురువు పవన్ కళ్యాణ్ గారి  ఆశీస్సులతో దీన్ని ప్రారంభించాను. నా కెరీర్‌ తొలినాళ్లలో నాకు సహకరించిన నిర్మాత దిల్‌రాజు, నా మిత్రులు నవీన్  విజయ్‌కృష్ణ, హర్షిత్ శ్రీ, ‘సత్య’ సినిమా టీమ్‌తో కలిసి ఈ సంస్థను ప్రారంభించడం సంతోషంగా ఉంది’’ అని ఇన్స్టా గ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

Sai-tej-4.jpg

Updated Date - Mar 09 , 2024 | 03:55 PM