మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sai Durga Tej: అమ్మ ఎప్పుడూ నాతోనే ఉంటుందనే ఉద్దేశంతో...

ABN, Publish Date - Mar 09 , 2024 | 10:11 AM

మెగా మేనల్లుడు సాయితేజ్‌ (Sai tej)పేరు మార్చుకున్నారు. మాతృమూర్తి పేరు దుర్గను తీసుకుని సాయి దుర్గ తేజ్‌గా (Sai durga tej) పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

మెగా మేనల్లుడు సాయితేజ్‌ (Sai tej)పేరు మార్చుకున్నారు. మాతృమూర్తి పేరు దుర్గను తీసుకుని సాయి దుర్గ తేజ్‌గా (Sai durga tej) పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. తన తల్లి ఎప్పుడూ తనతో ఉన్నట్లుందనే ఉద్దేశంతో అలా చేసినటు చెప్పారు. నిర్మాణ సంస్థను నెలకొల్పాలనే కోరిక ఇన్నాళ్లకు నెరవేరిందని, ప్రొడక్షన్  హౌస్‌కు విజయ దుర్గ ప్రొడక్షన్స్‌ (Vijaya durga productions) అనే పేరు పెట్టానని వెల్లడించారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ‘సత్య’ (Satya) ప్రెస్‌ మీట్‌ వేదికగా ఆయన మాట్లాడారు.


'గాంజా శంకర్‌' చిత్రం ఆగిపోయిందనే ప్రశ్నకు స్పందిస్తూ "ఓ వెబ్‌సైట్‌లో ఆ సినిమా నిలిచిపోయిందనే వార్త చదివాను. ఆ తర్వాత అప్‌డేట్‌ గురించి తనకు తెలియదు’ అని వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. ఆ సైట్‌ రాసిన వార్త వల్లే ఆ విషయం తనకు తెలిసిందన్నారు. రామ్‌ చరణ్‌తో కలిసి నటించే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు ‘‘నాగబాబు, పవన్‌ కల్యాణ్‌ మావయ్యలతో కలిసి నటించా. తర్వాత చిరంజీవి మామయ్యతో కలిసి స్ర్కీన షేర్‌ చేసుకోవాలన్నదే లక్ష్యం. ఆ డ్రీమ్‌ పూర్తయ్యాక మా ఫ్యామిలీలోని ఇతర హీరోలతో కలిసి నటిస్తా’’ అని అన్నారు. గతంలో కూడా సాయి ధరమ్ తేజ్ గా ఉన్న పేరును సాయి తేజ్ గా మార్చుకున్న విషయం తెలిసిందే.



సాయి దుర్గ తేజ్‌, కలర్స్‌ స్వాతి ముఖ్య పాత్రల్లో నటించిన లఘు చిత్రం ‘సత్య’. నవీన్‌ విజయ్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ మ్యూజికల్‌ షార్ట్‌ ఫిల్మ్‌ పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. ఇటీవల నిర్వహించిన టౌలౌజ్‌ షార్ట్స్‌ ఫెస్ట్‌ (ఫ్రాన్స్‌)లో ప్రదర్శితమై, ఎనిమిది అవార్డులు, ఒనిరోస్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌లో రెండు పురస్కారాలు దక్కించుకుంది. 

Updated Date - Mar 09 , 2024 | 10:16 AM