RRR - Oscar: బెస్ట్‌ యాక్షన్  సన్నివేశాల ఏవీలో 'ఆర్‌ఆర్‌ఆర్‌'

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:35 PM

ఆస్కార్‌(Oscar 2024) వేదికపై 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR)చిత్రం మరోసారి మెరిసింది. లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌ వేదికగా జరిగిన వేడుకలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దృశ్యాలు కనిపించాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

RRR - Oscar: బెస్ట్‌ యాక్షన్  సన్నివేశాల ఏవీలో 'ఆర్‌ఆర్‌ఆర్‌'



ఆస్కార్‌(Oscar 2024) వేదికపై 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR)చిత్రం మరోసారి మెరిసింది. లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌ వేదికగా జరిగిన వేడుకలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దృశ్యాలు కనిపించాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హ్యాష్‌ట్యాగ్‌ ఎక్స్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. గత సంవత్సరం బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ‘నాటునాటు’ పాట ఆస్కార్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే! 

sss.jfif

కోట్లమంది భారతీయుల కలను నిజం చేసిన ఆ పాటలోని స్టెప్పులు ఈ ఏడాది ఆస్కార్‌ వేదికపై మరోసారి కనిపించాయి. ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో అవార్డును ప్రకటించే క్రమంలో తెరపై ‘నాటునాటు’ పాటను ప్రదర్శించారు.  అంతేకాదు ఇప్పటి వరకు సినిమాల్లో వచ్చిన బెస్ట్‌ యాక్షన్ కు సంబంధించిన ప్రత్యేక ఏవీని వేదికపై ప్రదర్శించారు. అందులోనూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని రెండు యాక్షన్‌ షాట్స్‌ను చూపించడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసింది. దీంతో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఏడాది బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ అవార్డు ‘బార్బీ’ చిత్రంలోని ‘వాట్‌ వాస్‌ ఐ మేడ్‌ ఫర్‌’ అనే పాటకు వచ్చింది.

Updated Date - Mar 11 , 2024 | 12:39 PM