RRR Documentary: మూడేళ్లు.. వందల మంది కష్టం తెరపైకి మరో రూపంలో..
ABN , Publish Date - Dec 19 , 2024 | 02:42 PM
టాలీవుడ్‌లో ఇద్దరు స్టార్ హీరోలు, పరాజయం తెలియని స్టార్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించడం ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తీసుకొచ్చింది. ఈ మూడు గంటల సినిమా వెనుక మూడేళ్ల పాటు వందల మంది కష్టం ఉందనే విషయం అందరికీ తెలిసిందే!
ఎన్టీఆర్(NTR), రామ్‌చరణ్(Ram Charan) హీరోలుగా ఎస్.ఎస్.రాజమౌళి ( SS Rajamouli) దర్శకత్వంలో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలియాభట్, ఓలివియా మోరిస్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, అలీసన్ డూడీ, దివంగత నటుడు రే స్టీవెన్ సన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అంతర్జాతీయ స్థాయిలో పలుల అవార్డులు అందుకున్న ఈ చిత్రం ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డు సొంతం చేసుకొని, చరిత్ర సృష్టించింది. ఓటీటీలోనూ రికార్డు వ్యూస్‌తో అలరించిన ఈ చిత్రం ఇప్పుడు మరో రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. (RRR Documentary)
టాలీవుడ్‌లో ఇద్దరు స్టార్ హీరోలు, పరాజయం తెలియని స్టార్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించడం ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తీసుకొచ్చింది. ఈ మూడు గంటల సినిమా వెనుక మూడేళ్ల పాటు వందల మంది కష్టం ఉందనే విషయం అందరికీ తెలిసిందే! ఇదంతా ఇప్పుడు డాక్యుమెంటరీ రూపంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర బృందం ప్రేక్షకులకు అందించడానికి సిద్థమైంది. ‘ఆర్‌ఆర్‌ఆర్- బిహైండ్ అండ్ బియాండ్’ (RRR - Behind and Beyond documentary) పేరుతో డాక్యుమెంటరీని సిద్థం చేసింది. షూటింగ్ మొదలు పెట్టిన రోజు నుంచి ఆస్కార్’ అందుకునే వరకూ జరిగిన ఆసక్తికర విషయాలు ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు.
అయితే మొదట ఈ డాక్యుమెంటరీ ప్రకటన వచ్చినప్పుడు ఓటీటీలో విడుదల చేస్తారని భావించారంతా. అయితే వినూత్నంగా ఆలోచించే రాజమౌళి, ‘ఆర్‌ఆర్‌ఆర్’ డాక్యుమెంటరీని థియేటర్‌లో విడుదల చేస్తున్నారు. డిసెంబరు 20వ తేదీ నుంచి ఎంపిక చేసిన మల్టీప్లెక్స్ స్ర్కీన్‌లలో దీనిని ప్రదర్శించనున్నారు. బుక్ మై షోలో ఇందుకు సంబంది?ంచిన టికెట్లను అందుబాటులో ఉంచారు.