ఐపీఎస్ అధికారిగా ఆర్కే సాగర్.. మూవీ టైటిల్ ఏంటంటే?

ABN , Publish Date - Feb 02 , 2024 | 04:28 PM

ఆర్కే నాయుడుగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన సాగర్‌.. ‘సిద్ధార్థ’ అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇటీవల ‘షాదీ ముబారక్‌’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ క్రమంలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో వచ్చేందుకు సాగర్ సిద్ధమవుతున్నారు. ‘ది 100’ అనే వైవిధ్యమైన టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్ర పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రాఘవ్ ఓంకార్ శశిధర్ ఈ చిత్రానికి దర్శకుడు.

ఐపీఎస్ అధికారిగా ఆర్కే సాగర్.. మూవీ టైటిల్ ఏంటంటే?
RK Sagar

ఆర్కే నాయుడు (RK Naidu)గా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన సాగర్‌ (Sagar).. ‘సిద్ధార్థ’ అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇటీవల ‘షాదీ ముబారక్‌’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ క్రమంలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో వచ్చేందుకు సాగర్ సిద్ధమవుతున్నారు. ‘ది 100’ అనే వైవిధ్యమైన టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్ర పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకుడు. గతంలో దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ (Ohmkar Sashidhar) డైరెక్ట్ చేసిన ఇండిపెండెంట్ ఫిలిమ్స్ ఎన్నో అంతర్జాతీయ అవార్డ్స్‌ను సొంతం చేసుకున్నాయి. ‘ద 100’ సినిమాతో దర్శకుడిగా ఆయన వెండితెరకు పరిచయం అవుతున్నారు.

ఈ మూవీలో విక్రాంత్ అనే ఐపీఎస్ అధికారి పాత్రలో ఆర్కే సాగర్ నటిస్తున్నారు. ఈ సినిమాలోని తన పాత్ర కోసం ఆర్కే సాగర్ ఫిట్నెస్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ఈ పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది. టైటిల్ పోస్టర్‌‌లో పంచింగ్ హ్యాండ్‌ని గమనిస్తే.. ఈ సినిమా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో మంచి యాక్షన్‌తో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి మేకర్స్ మాట్లాడుతూ.. విక్రాంత్‌గా ఐపీఎస్ పాత్రలో ఆర్కే సాగర్ ఇంప్రెస్ చేయనున్నాడు, ఇదొక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌ అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్‌తో, ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లే‌తో ఈ సినిమా అందరినీ అలరిస్తుందని పేర్కొన్నారు. (The 100 Movie Details)


RK-Sagar-The-100.jpg

ఈ చిత్రానికి శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించగా.. విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’, బాలీవుడ్ చిత్రం ‘యానిమల్’కు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ పూర్తి చేసుకున్న ‘ద 100’ చిత్రం త్వరలో థియేటర్స్‌లోకి రానుంది. విడుదలకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. (RK Sagar New Film The 100)


ఇవి కూడా చదవండి:

====================

*Gaddar Awards: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన గద్దర్ అవార్డ్స్‌పై మంచు మోహన్ బాబు స్పందనిదే..

*************************

*Bubblegum: సుమ తనయుడి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్..

**************************

Updated Date - Feb 02 , 2024 | 04:28 PM