RJ : దర్శకురాలిగా ఆర్జే శ్వేతా

ABN , Publish Date - May 11 , 2024 | 05:03 PM

'వీడు మూసలోడు అవ్వకూడదే..’ 'మా టీచర్‌ చెప్పింది నాన్న.. మగతనం అంటే రెండు కాళ్ల మధ్య ఉండేది కాదు.. మగాడి నరనరాల్లోని ఉంటుందని’ ఈ డైలాగులు వినగానే 'ఉప్పెన' చిత్రంలో బేబమ్మ పాత్ర గుర్తొస్తుంది.

RJ : దర్శకురాలిగా ఆర్జే శ్వేతా


'వీడు మూసలోడు అవ్వకూడదే..’


'మా టీచర్‌ చెప్పింది నాన్న.. మగతనం అంటే రెండు కాళ్ల మధ్య ఉండేది కాదు..
మగాడి నరనరాల్లోని ఉంటుందని’


ఈ డైలాగులు వినగానే 'ఉప్పెన' (Uppena) చిత్రంలో బేబమ్మ పాత్ర గుర్తొస్తుంది.

అలాగే ఆ పాత్రకు డబ్బింగ్‌ చెప్పిన ఆర్‌జే శ్వేత (Rj Swetha) కూడా గుర్తొస్తుంది. రేడియో జాకీగా  ఎంతో కాలంగా పని చేస్తూ  చక్కని గుర్తింపు పొందిన ఆర్జే.. శ్వేత పి.వి.ఎస్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ఎంతోమంది హీరోయిన్ లకు తన గొంతు అరువిచ్చింది. ఇప్పుడు ఆమె మెగాఫోన్‌ పట్టబోతోంది. బిగ్‌ బెన్‌ ప్రొడక్షన్‌లో ఓ కొత్త సినిమా త్వరలోనే శ్రీకారం చుట్టుకోబోతోంది. దీనికి శ్వేత దర్శకురాలు.

Swetha.jpg

బిగ్‌ బెన్‌ సంస్థకు కొత్త దర్శకుల్ని పరిచయం చేయడం అలవాటు. తరుణ్‌ భాస్కర్‌, భరత కమ్మ, కె.వి.ఆర్‌. మహేంద్ర, సంజీవ్‌ రెడ్డి, ప్రణీత్‌, చెందు ముద్దు ఇలా కొత్త టాలెంట్‌ ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు శ్వేతని కెప్టెన్‌ కుర్చీలో కూర్చోబెట్టింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో చిత్ర బృందం వెల్లడించనుంది. ఈ చిత్రానికి యష్ రంగినేని నిర్మాత. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ రేపు ఉదయం 11.07 నిమిషాలకు విడుదల చేయనున్నారు. రివీల్‌ చేయబోతున్నారు. 

Rj.jpeg

Updated Date - May 11 , 2024 | 05:04 PM