Varun Tej: హీరోయిన్ దొరికినట్టేనా..
ABN , Publish Date - Dec 19 , 2024 | 11:08 AM
అశోక వనంలో అర్జున కల్యాణం’ సినిమాలో నటించింది రితిక. ‘హాయ్ నాన్న’లోనూ అలరించింది.
‘మట్కా’ (Matka) సినిమాతో ఇటీవల మన ముందకు వచ్చారు వరుణ్ తేజ్(varun Tej). ఈ సినిమాకు ముందు వచ్చిన ‘గని’, ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రాలు నిరాశపరచాయి. ఇప్పుడు ‘మట్కా’ కూడా ఆ లిస్ట్‌లో చేరిసోయింది. ఇప్పుడు వరున్ తేజ్‌కు హిట్ చాలా అవసరం. ఈ సమయంలో అడపాదడపా హిట్టు ఉన్న మేర్లపాక గాంధీతో సినిమాకు సై అన్నాడు వరుణ్.. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘కొరియన్ కనకరాజు’ . రాయలసీమ నేపథ్యంలో సాగే హారర్ సినిమా ఇది. కొరియన్ బ్యాక్ డ్రాప్ కూడా ఉంటుంది. అందుకే ఈ సినిమాకు ఆ పేరు పెట్టారు.
ఇందులో హీరోయిన్‌గా రితికా (Rithika Naaik) నాయక్‌ని ఎంచుకొన్నట్టు సమాచారం అందుతోంది. ‘అశోక వనంలో అర్జున కల్యాణం’ సినిమాలో నటించింది రితిక. ‘హాయ్ నాన్న’లోనూ అలరించింది. ప్రస్తుతం 'మిరాయ్'లో నటిస్తోంది. ఇప్పుడు వరుణ్ సినిమాలో ఒకే అయినట్టు తెలుస్తోంది. ఇటీవల రితికపై ఓ లుక్ టెస్ట్ కూడా నిర్వహించారు. జనవరిలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. హారర్ జోనర్ అయినా.. ఇప్పటి వరకూ టచ్ చేయని ఓ కొత్త పాయింట్ తో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఇందులో కొందరు కొరియన్ నటీనటులు కనిపించే అవకాశం ఉందట. వాళ్ల కోసం ప్రస్తుతం ఆడిషన్స్ జరుగుతున్నాయి.